Ration Cards: మొత్తం ఎన్నిరకాల రేషన్ కార్డులు ఉన్నాయి.? వాటి ఉపయోగం ఏంటో తెలుసా?
ఇక రేషన్ కార్డ్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది తక్కువ ధరకు ఆహారా ధాన్యాలను కొనుగోలు చేయొచ్చని. వన్ రేషన్ వన్ నేషన్ పేరుతో దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డ్ అనేది కేవలం ఆహార ధాన్యాలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా ఆధార్, పాన్ కార్డులాగే...
రేషణ్ కార్డ్ ఎంత ఉపయోగకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే కచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాల్సిందే. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డ్ ఉన్న వారికే సంక్షేమ పథకాలు అందుతాయంటూ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకే పేద ప్రజలు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాలని కోరుకుంటారు. అందుకోసం దరఖాస్తు చేసుకుంటారు. ఆరోగ్య శ్రీ వంటి పథకాలకు కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు.
ఇక రేషన్ కార్డ్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది తక్కువ ధరకు ఆహారా ధాన్యాలను కొనుగోలు చేయొచ్చని. వన్ రేషన్ వన్ నేషన్ పేరుతో దేశంలో ఎక్కడైనా ఆహార ధాన్యాలను తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డ్ అనేది కేవలం ఆహార ధాన్యాలు తీసుకోవడానికి మాత్రమే కాకుండా ఆధార్, పాన్ కార్డులాగే ఒక గుర్తింపు కార్డులాగా కూడా పని చేస్తుంది. సిమ్‌కార్డ్ మొదలు, పాస్‌పోర్ట్ దరఖాస్తు వరకు అన్నింటికీ రేషన్ కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇదిలా ఉంటే.. దేశంలో ప్రస్తుతం పలు రకాల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ రేషన్ కార్డులు ఏంటి.? వాటి ఉపయోగం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం రేషన్ కార్డు సహాయంతో సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేయొచ్చు. అయితే ఈ చట్టం అమల్లోకి రాకముందు.. రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఆధారంగా, అర్హత కలిగిన కుటుంబాలు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేవి. అయితే 2013 నుంచి జాతీయ ఆహార భద్రతా చట్టం అమట్లోకి వచ్చింది. దీంతో లబ్ధిదారుల అర్హతల ఆధారంగా మొత్తం మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఆ మూడు రేషన్ కార్డులు ఏంటి.? వాటి ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అంత్యోదయ అన్న యోజన (AAY) రేషన్ కార్డు..
స్థిరమైన ఆదాయం లేని పేద కుటుంబాలకు ఈ కార్డులను అందిస్తారు. ఉదాహరణకు దినసరి కూలీలు, రిక్షా కార్మికులు వంటి వారికి ఈ రేషన్ కార్డులను అందిస్తారు. పేద మహిళలు, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు కూడా ఈ కార్డును అందిస్తారు. ఈ కార్డులు కలిగిన ప్రతి కుటుంబాలు.. నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు పొందేందుకు అర్హులు.
ప్రియారిటీ హౌస్‌హోల్డ్ (PHH) రేషన్ కార్డు..
అంత్యోదయ అన్న యోజన పరిధిలోకి రాని కుటుంబాలు ప్రియారిటీ హౌస్ హోల్డ్ రేషన్ కార్డు పరిధిలోకి స్తారు. ఈ కార్డులను జారీ చేసిన ప్రతీ కుటుంబంలోని ప్రతీ వ్యక్తికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందిస్తారు.
నాన్-ప్రియారిటీ హౌస్‌హోల్డ్(NPHH) రేషన్ కార్డు..
ఇక ప్రియారిటీ హౌస్ హెల్డ్ పరిధిలోకి రాని కుటుంబాలకు ఈ రేషన్ కార్డులను అందిస్తారు. అయితే ఈ కార్డు పొందిన వారికి ఆహార ధాన్యాలు అందవు. కానీ పలు రకాల ప్రభుత్వం పథకాలకు, అలాగే కేవలం ఒక గుర్తింపు కార్డుగా మాత్రమే ఉపయోగపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..