Punjab CM in Vizag: పంజాబ్ సీఎం భగవంత్ ఇన్ని రోజుల పాటు తన రాష్ట్రాన్ని వదిలేసి విశాఖలో ఎలా ఉంటున్నారు?

ఇన్ని రోజులు పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ ఎలా ఉంటున్నారు? అందుకు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ఉంటున్నారు? అన్ని రోజులు పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? అన్న అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి చర్చే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ పై జరుగుతుంది .

Punjab CM in Vizag: పంజాబ్ సీఎం భగవంత్ ఇన్ని రోజుల పాటు తన రాష్ట్రాన్ని వదిలేసి విశాఖలో ఎలా ఉంటున్నారు?
Cm Mann In Visakhapatnam Pema Wellness Resort
Follow us
Eswar Chennupalli

| Edited By: Balaraju Goud

Updated on: Jan 05, 2024 | 8:53 PM

సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో పర్యటిస్తే చాలా ఆసక్తికరమైన పరిణామంగా చూస్తాం. అలాంటిది ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక రాష్ట్రంలో ఐదు రోజులు పాటు బస చేశారంటే వినడానికే చాలా కొత్తగా, అంతకంటే ఆసక్తిగా ఉంటుంది. సాధారణంగా ఏదైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్ర పరిధి దాటి ఏదైనా విదేశీ పర్యటన ఉంటే తప్ప.. దేశీయ పర్యటనకు వెళ్ళినప్పుడు అదే రోజు తిరిగి రావడం, లేదంటే రెండో రోజైనా కచ్చితంగా తిరిగి తన రాష్ట్రానికి వస్తుండడం జరుగుతుంది. కానీ పంజాబ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి నాలుగు రోజులు గడిచింది. మరో రోజు కూడా ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉండనున్నారు. ఐదు రోజులు పాటు ఆయన విశాఖలో ఏం చేస్తున్నారు అన్న దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇన్ని రోజులు పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని వదిలేసి ఇక్కడ ఎలా ఉంటున్నారు? అందుకు బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ ఉంటున్నారు? అన్ని రోజులు పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారు? అన్న అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి చర్చే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ పై జరుగుతుంది

పంజాబ్ ముఖ్యమంత్రి అసలు విశాఖ ఎందుకు వచ్చారంటే?

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జనవరి 2వ తేదీ మంగళవారం విశాఖపట్నం వచ్చారు. విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న ప్రఖ్యాత వెల్ నెస్ సెంటర్ లో మెడిటేషన్ కోర్స్ కోసం పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చారు. దీనిని బేపార్క్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందిన వెల్నెస్ సెంటర్ ఇదే.

తూర్పు తీర బంగాళాఖాత సముద్ర తీరానికి అభిముఖంగా ఎత్తైన కొండపై అత్యంత ఆహ్లాదకరమైన, విలాసవంతమైన సౌకర్యాలతో సెవెన్ స్టార్ హోటల్ ని మైమరిపించే వెల్నెస్ సెంటర్ ఇది. ఇక్కడ శారీరక, మానసిక రుగ్మతులకు ప్రకృతి వైద్యాన్ని అందిస్తారు. ఇక్కడ అందుబాటులో ఉండే థెరపీలు అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచాయి. అందుకే ఇక్కడికి దేశ విదేశాల ప్రముఖులు సందర్శిస్తూ ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలోని పలువురు మంత్రులు ఉన్నతాధికారులు తమకు సమయం అనుమతించినప్పుడు ఈ సెంటర్ కి వచ్చి చికిత్స తీసుకుని మానసిక శారీరక ఉల్లాసాన్ని పొందుతూ ఉంటారు. అందుకే ఇక్కడ నిత్యం పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఉన్నతాధికారులు ఎవరో ఒకరు ఉంటుంటారు. ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత కూడా ఉంటుంది. సాధారణంగా అక్కడికి వచ్చే వాళ్ళు వివరాలను కూడా చాలా గోప్యంగా ఉంచుతారు. వచ్చి వెళ్లిన విషయాన్ని రహస్యంగానే ఉంచుతారు.

పెమా వెల్ నెస్ సెంటర్ కు ఎందుకు అంత ప్రాముఖ్యత?

శరీరం, మనస్సు, ఆత్మల మధ్య సామరస్యాన్ని సాధ్యం చేసేందుకు అనుకూలీకరించిన పలు ప్రోగ్రామ్‌లతో ఈ వెల్‌నెస్ రిసార్ట్ డిజైన్ చేయడం జరిగింది. దీనికి పెమా వెల్‌నెస్ అని పేరు. ఇక్కడ సంపూర్ణ మానసిక, శారీరక వైద్యంతో పాటు జ్ఞానాన్ని ఉద్దీపించే విధంగా రూపొందించిన రిసార్ట్. ఇక్కడ ఉండే హీలింగ్ కోర్స్‌లలో రోజువారీ జీవితంలో ఒత్తిళ్లను అధిగమించే విధంగా మానసిక దృఢత్వాన్ని పొందే విధంగా ప్రోగ్రామ్స్ ఉంటాయి.

విశాఖలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీకి పంజాబ్ సీఎం

విశాఖ లో ఐదు రోజుల పాటు వెల్‌నెస్ సెంటర్‌‌లో మెడిటేషన్ కోసం వచ్చిన పంజాబ్ సీఎం, నాలుగో రోజైన శుక్రవారం విశాఖ ఫార్మా సిటీ ని సందర్శించారు. రాంకీ ఫార్మా ను సందర్శించి ఫార్మా సంస్థల ఏర్పాటు, ఎఫ్లూయింట్ ట్రీట్మెంట్ ప్లాంట్, కాలుష్య నియంత్రణ కు సంబంధించిన చర్యలు, అక్కడ ఉత్పత్తులు, ఎగుమతులు లాంటి అనేక అంశాలను అడిగి తెలుసుకున్నారు భగవంత్ మాన్ సింగ్. పంజాబ్ లో కూడా అత్యున్నత కాలుష్య నియంత్రణ ప్రణామాలతో ఫార్మా సిటీ ని ఏర్పాటు చేసే ప్రణాళిక ఉన్నట్టు వివరించారు.

ఐదు రోజుల పర్యటన పై పంజాబ్ బీజేపీ సెటైర్లు

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విశాఖ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ కుమార్ జాఖర్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. “ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జీ నాలుగు రోజుల పాటు ధ్యానం కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలా చేయడం ద్వారా అతను పంజాబ్‌లోని హోషియార్‌పూర్ ధ్యాన కేంద్రం సరిపోదని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడా? లేక ఆయన హోషియార్‌పూర్‌లో తాజాగా కేజ్రీ వాల్ బస చేయడం విపాసన ధ్యానం చేయడం కోసం కాదని, కేంద్ర ఏజెన్సీల నుండి పారిపోయి సురక్షితమైన స్వర్గాన్ని కోరుకునేందుకే అని ఆరోపణలను బహిర్గతం చేయడమా? అంటూ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!