బంగ్లాదేశ్ హింసలో పాకిస్తాన్ హస్తం..? భారతదేశంపై పెద్ద కుట్రకు ISI ఫ్లాన్..!
బంగ్లాదేశ్‌లో హింస జరుగుతున్న సమయంలో, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు సంబంధించి ఒక పెద్ద కుట్ర బయటపడింది. బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలోకి ఉగ్రవాదులను చొరబాట్లకు కుట్ర పన్నుతోంది. పాకిస్తాన్ ఏజెన్సీ అనేక మంది ఉగ్రవాదులకు శిక్షణ కూడా ఇచ్చింది. అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ద్వారా చొరబాటులకు ఫ్లాన్ వేసినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది.

బంగ్లాదేశ్‌లో హింస జరుగుతున్న సమయంలో, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు సంబంధించి ఒక పెద్ద కుట్ర బయటపడింది. బంగ్లాదేశ్ ద్వారా భారతదేశంలోకి ఉగ్రవాదులను చొరబాట్లకు కుట్ర పన్నుతోంది. పాకిస్తాన్ ఏజెన్సీ అనేక మంది ఉగ్రవాదులకు శిక్షణ కూడా ఇచ్చింది. నివేదికల ప్రకారం, అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ద్వారా చొరబాటులకు ఫ్లాన్ వేసినట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది.
బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న పేద ప్రజలను, రోహింగ్యాలను ఆకర్షించి, వారికి డబ్బు ఆశ చూపి జిహాద్ కోసం భారతదేశానికి పంపే కుట్ర జరుగుతోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైష్ రెండూ చురుకుగా పనిచేస్తున్నాయని భారత నిఘా వర్గాలకు సమాచారం సేకరించింది.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్, అన్సార్-ఉల్లా బంగ్లా టీమ్, హిజ్బ్ ఉత్-తహ్రీర్ వంటి రాడికల్ బంగ్లాదేశ్ గ్రూపులతో చేతులు కలిపాయి. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌లతో అనుబంధంగా ఉన్న అనేక మంది ఉగ్రవాదులు ఇటీవల బంగ్లాదేశ్‌లో కనిపించారు. జైష్-ఎ-మొహమ్మద్ సభ్యుడు మజార్ సయీద్ షా కూడా బంగ్లాదేశ్‌కు వెళ్లాడు. నిఘా సంస్థలు బంగ్లాదేశ్ సరిహద్దును నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. భద్రతా దళాలు కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశాలు అందాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
