Gobi Paratha: దాభా స్టైల్లో గోబీ పరాటా ఇలా చేయండి.. సూపర్ టేస్టీగా ఉంటుంది!
చాలా మందికి బయటకు వెళ్లి దాభా స్టైల్ ఫుడ్ తినాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లలేరు. అందులోనూ అక్కడి వాతావరణం నచ్చక.. వాళ్లు నీటిగా చేసారో లేదో అని ఆ ఫుడ్ ని మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇంట్లోనే పంజాబీ స్టైల్ గోబీ పరాటా తయారు చేసుకోవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. పరాటాలు అనగానే చాలా మందికి మైదాపిండే గుర్తుకు వస్తుంది. మైదా పిండితోనే కాకుండా.. గోధుమ పిండితో కూడా ఈ పరాటాలను మనం చేసుకోవచ్చు. క్యాలీ ఫ్లవర్ తో చేసే ఈ పరాటాలు.. తినేకొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. వీటిని ఉదయం..

చాలా మందికి బయటకు వెళ్లి దాభా స్టైల్ ఫుడ్ తినాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్లలేరు. అందులోనూ అక్కడి వాతావరణం నచ్చక.. వాళ్లు నీటిగా చేసారో లేదో అని ఆ ఫుడ్ ని మిస్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇంట్లోనే పంజాబీ స్టైల్ గోబీ పరాటా తయారు చేసుకోవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. పరాటాలు అనగానే చాలా మందికి మైదాపిండే గుర్తుకు వస్తుంది. మైదా పిండితోనే కాకుండా.. గోధుమ పిండితో కూడా ఈ పరాటాలను మనం చేసుకోవచ్చు. క్యాలీ ఫ్లవర్ తో చేసే ఈ పరాటాలు.. తినేకొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోనైనా, సాయంత్రం స్నాక్ గా లేదా రాత్రి భోజనంగా ఎలాగైనా తీసుకోవచ్చు. ఈ పరాటా ఒక్కటి తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. మరి ఈ పంజాబీ స్టైల్ గోబీ పరాటాలు ఎలా తయారు చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబీ గోబీ పరాటాకు కావాల్సిన పదార్థాలు:
సన్నగా తురిమిన క్యాలీ ఫ్లవర్ – 100 గ్రాములు, గోధుమ పిండి – ఒక కప్పు, ఉప్పు – రుచికి సరిపడినంత, నెయ్యి, బటర్ లేదా నూనె – కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు – 3, కారం – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, పచ్చిమిర్చి తరుగు – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోకి ఉప్పు, కొంచెం నెయ్యి లేకపోతే నూనె వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత కాస్త గోరు వెచ్చగా ఉన్న నీటిని కొంచెం కొంచెం వేస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఈ పిండిని అరగంట లేదా గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు క్యాలీ ఫ్లవర్ ను ఓ వస్త్రంలో వేసి నీరంతా పోయేలా గట్టిగా పిండి పక్కకు పెట్టుకోవాలి. ఆ నెక్ట్స్ పిండిన క్యాలీ ఫ్లవర్ లోకి మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని కలుపుకోవాలి.
తర్వాత ఆలూ పరోటా ఎలా అయితే చేస్తామో.. ఇది కూడా అలాగే చపాతీ ఉండను తీసుకుంటూ ముందుగా చేత్తో వెడల్పుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా క్యాలీ ఫ్లవర్ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. తర్వాత పొడి పిండి చల్లుకుంటూ మందంగా పరోటాలా.. చపాతీ కర్రతో చేసుకోవాలి. ఆ తర్వాత పరాటాను వేడి వేడి పెనం మీద వేసి ముందు.. వెనుక.. రెండు వైపులా కాల్చుకోవాలి. తర్వాత నూనె లేదా బటర్ వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ గోబీ పరోటాలు సిద్ధం. వీటిని ఉత్తిగా స్నాక్ గా అయినా తినొచ్చు. లేదా ఆవకాయతో, రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




