AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: వారానికి ఎంత బరువు తగ్గితే ఆరోగ్యంగా ఉంటారు.. ఈ విషయాలు మీకోసమే!!

బరువు పెరిగినంత ఈజీగా అంత సులభంగా బరువు తగ్గలేం. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వీటి కారణంగానే బాడీలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతో కష్టపడితే కానీ.. నెల రోజుల్లో మార్పు రాదు. చాలా మంది బరువు తగ్గాలని ఒక్కసారే తినడం మానేసి.. వ్యాయామాలపై ఫోకస్ పెడుతూంటారు. కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీంతో డీ హైడ్రేషన్ కు గురై మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అసలు వారానికి ఎంత బరువు తగ్గాలి? ఎంత తగ్గితే ఆరోగ్యం..

Weight Loss Tips: వారానికి ఎంత బరువు తగ్గితే ఆరోగ్యంగా ఉంటారు.. ఈ విషయాలు మీకోసమే!!
Weight Loss
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 11, 2023 | 7:00 AM

Share

బరువు పెరిగినంత ఈజీగా అంత సులభంగా బరువు తగ్గలేం. ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వీటి కారణంగానే బాడీలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతో కష్టపడితే కానీ.. నెల రోజుల్లో మార్పు రాదు. చాలా మంది బరువు తగ్గాలని ఒక్కసారే తినడం మానేసి.. వ్యాయామాలపై ఫోకస్ పెడుతూంటారు. కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీంతో డీ హైడ్రేషన్ కు గురై మరిన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అసలు వారానికి ఎంత బరువు తగ్గాలి? ఎంత తగ్గితే ఆరోగ్యం ఉంటారు? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. దీంతో మీకు కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పలు అధ్యయనాల ప్రకారం వారానికి అర కిలో (0.5) నుండి కిలో వరకూ బరువు తగ్గొచ్చు. ఒక్కటేసారి దీని కంటే ఎక్కువ బరువు తగ్గితే ఇతన ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్పీడ్ గా బరువు తగ్గాలని ఒక్కసారిగా మీ డైట్ విషయంలో వర్కౌట్స్ విషయంలో మార్పులు చేసుకోకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ గా మెయిన్ టైన్ చేయాలి. దీనికి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం బెటర్. అలాగే మీ ఆరోగ్యం పై కూడా ఫోకస్ పెట్టాలి.

హెల్దీ వేలో బరువు తగ్గాలి:

ఇవి కూడా చదవండి

ఎప్పుడైనా సరే మీరు బరువు తగ్గాలని వర్కౌట్స్ స్టార్ట్ చేస్తే.. అందుకు తగ్గట్టే ఫుడ్ ని కూడా నిపుణుల సలహాలతో తీసుకోవాలి. మీ ఆరోగ్య విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. కాస్త రెస్ట్ తీసుకోవాలి. మొదటి రోజే ఎక్కువ బరువులు, బలవంతంగా వ్యాయామాలు చేయకూడదు.

పండ్లు, కూరగాయలు తీసుకోవాలి:

ఇంట్లో దొరికే వాటితోనే మనం ఈజీగా బరువు తగ్గొచ్చు. దీని కంటూ మీరు ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏ రోజు ఏ డైట్ తీసుకోవాలో ఓ చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దీంతో గజి బిజిగా ఉండదు. డైలీ దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. బరువు తగ్గే కూరగాయలు, పండ్లు ఏవో తెలుసుకుని వాటిని మీ డైట్ లో యాడ్ చేసుకోవాలి. అలాగే తరచూ జీలకర్ర నీరు తాగడం, పిప్పర్మెంట్ వాటర్ ఉపయోగించడం వంటివి చేస్తూండాలి.

ఒత్తిడిని తీసుకోకూడదు:

బరువు తగ్గాలన్న తొందరపాటులో ఏవి పడితే అవి చేసి.. ఏవి పడితే అవి తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు బరువు తగ్గే ప్రయత్నంలో టెన్షన్ తీసుకోకూడదు. వీలైనంత ప్రశాంతంగా ఉండాలి. సంతోషంగా ఉంటూ బరువు తగ్గే ప్రయత్నం చేస్తే.. మంచి రిజల్ట్స్ ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి