AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: లో దుస్తులను వాష్ చేయకుండా వాడుతున్నారా.. అయితే ఇన్ ఫెక్షన్స్ చుట్టుముడతాయి!!

చాలా మంది లో దుస్తుల గురించి మాట్లాడటానికి గానీ, వాటిని చూసి కానీ ఏదో ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన శరీరంలో ఇవే ముఖ్యమైన దుస్తులు. వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చాలా ప్రమాదం. వీటిని రెగ్యులర్ గా వాష్ చేయాలి. అలా ఉతికినవే వాడుతూ ఉండాలి. ఉతకకుండా వాడితే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం. అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం. ఈ కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరవు. అందులోనూ రెండు, మూడు రోజులకోసారి ఎండను చూసి ఉతుకుతూ ఉంటారు. దీంతో ఆల్రెడీ వాడినదే మళ్లీ కొంత..

Health Tips: లో దుస్తులను వాష్ చేయకుండా వాడుతున్నారా.. అయితే ఇన్ ఫెక్షన్స్ చుట్టుముడతాయి!!
Health tips
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 11, 2023 | 8:30 AM

Share

చాలా మంది లో దుస్తుల గురించి మాట్లాడటానికి గానీ, వాటిని చూసి కానీ ఏదో ఇన్ సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన శరీరంలో ఇవే ముఖ్యమైన దుస్తులు. వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకుండా చాలా ప్రమాదం. వీటిని రెగ్యులర్ గా వాష్ చేయాలి. అలా ఉతికినవే వాడుతూ ఉండాలి. ఉతకకుండా వాడితే చాలా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం. అందులోనూ ప్రస్తుతం వర్షాకాలం. ఈ కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరవు. అందులోనూ రెండు, మూడు రోజులకోసారి ఎండను చూసి ఉతుకుతూ ఉంటారు. దీంతో ఆల్రెడీ వాడినదే మళ్లీ కొంత మంది వాడుతూ ఉంటారు. అయితే అలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇలా వాడటం వల్ల ఎన్నో దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. మరి అవేంటో తెలుసుకోండి.

దుర్వాసన:

చాలా మందికి ప్రైవేట్ పార్ట్స్ వద్ద దుర్వాసన వస్తూ ఉంటుంది. లో దుస్లుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా, చెమట కారణంగా ఈ వాసన వస్తుంది. కాబట్టి లో దుస్తులను క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఉతికినవి ధరిస్తే ఈ దుర్వాసన రాదు.

ఇవి కూడా చదవండి

ఇన్ ఫెక్షన్స్:

ఉతకని లో దుస్తుల్లో క్రిములు బాగా పెరుగుతాయి. ఎందుకంటే మన చెమట, మూత్ర కణాలు అనేవి దాన్ని అతుక్కుని ఉంటాయి. దీని వల్ల బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. చెమట, నీరు నిలిచిపోవడం వల్ల ప్రైవేట్ పార్ట్స్ లో మూత్రం నిలిచిపోతుంది. ఇది ఈస్ట్ ఇన్ ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.

తడిగా ఉన్నవి వేసుకోకూడదు:

తడిగా ఉన్న లో దుస్తులు అస్సలు వాడకూడదు. ఇది ఇన్ ఫెక్షన్ ని పెంచడమే కాకుండా.. ఈస్ట్ ఇన్ ఫెక్షన్స్ కి దారి తీస్తుంది. ఇది లైంగికంగా కూడా ఒకరి నుంచి మరొకరికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి రెగ్యులర్ గా లో దుస్తులను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కగా ఆరిన వాటినే యూజ్ చేయాలి. ఉతికిన తర్వాత వాటిని ఎండలో ఆరబెడితే మంచిది.

పరిశుభ్రత పాటించాలి:

ఓ సారి వాడిన ఇన్నర్ వేర్స్ మళ్లీ మళ్లీ వాడకూడదు. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. దీంతో ప్రైవేట్ పార్ట్స్ లో మొటిమలు, ఉత్సర్గాలకు కారణం అవుతంది. అందుకే ప్రతీ ఒక్కరూ క్లీన్ ఉండే లో దుస్తులనే వాడటం బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!