How to Handle Criticism: ‘విమర్శ అంటే హృదయాన్ని గాయపరిచేదే కాదు తప్పులను ఎత్తి చూపడం కూడా’

వ్యక్తిగత జీవితంలో, ప్రొఫెషనల్ లైఫ్‌లో మన చుట్టూ ఉండే వారు కొన్నిసార్లు విమర్శనాస్త్రాలు సందిస్తూ ఉంటారు. వెంటనే అవి మనసుకు గుచ్చుకుని.. కకావికలం చేస్తాయి. దీంతో అవే మాటలు చెవుల్లో పదేపదే మారుమ్రోగుతూ ఉంటాయి. కొందరు ఇతరుల విమర్శలను అస్సలు భరించలేరు. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి కూడా వెళ్తుంటారు. మరైతే ఎదుటివారు మనసును గాయపరిచేలా మాట్లాడితే ఏం చేయాలి? అలాంటప్పుడు ఏ విధంగా స్పందించాలి..

How to Handle Criticism: 'విమర్శ అంటే హృదయాన్ని గాయపరిచేదే కాదు తప్పులను ఎత్తి చూపడం కూడా'
How To Handle Criticism
Follow us

|

Updated on: Apr 01, 2024 | 8:44 PM

వ్యక్తిగత జీవితంలో, ప్రొఫెషనల్ లైఫ్‌లో మన చుట్టూ ఉండే వారు కొన్నిసార్లు విమర్శనాస్త్రాలు సందిస్తూ ఉంటారు. వెంటనే అవి మనసుకు గుచ్చుకుని.. కకావికలం చేస్తాయి. దీంతో అవే మాటలు చెవుల్లో పదేపదే మారుమ్రోగుతూ ఉంటాయి. కొందరు ఇతరుల విమర్శలను అస్సలు భరించలేరు. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి కూడా వెళ్తుంటారు. మరైతే ఎదుటివారు మనసును గాయపరిచేలా మాట్లాడితే ఏం చేయాలి? అలాంటప్పుడు ఏ విధంగా స్పందించాలి అనే విషయం చాలా మందికి తెలియదు. దీనినే ఇంగ్లిష్‌లో How to face criticism? అని అంటారు. నిజానికి.. ఎదుటి వ్యక్తుల నుంచి వచ్చిన విమర్శలను స్వీకరించడానికి పెద్ద మనసు, విశాల ఆలోచనా దృక్పదం కావాలి. కానీ ఏ తప్పు చేయకపోయినా పదేపదే నేరస్తుల్లా పరుష మాటలతో చేసే విమర్శలను వినడానికి ఎవరూ ఇష్టపడరు. దీని వల్ల మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. చాలా సందర్భాలలో ఈ సమస్యలు గొడవలకు దారి తీస్తాయి కూడా. ఎందుకంటే ప్రతిఒక్కరూ విమర్శలను వ్యక్తిగత దాడిగా భావిస్తారు. అయితే ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ఢిల్లీకి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దామిని గ్రోవర్ ఏం చెబుతున్నారంటే.. విమర్శల వెనుక కారణాలను అర్థం చేసుకునేంత వరకు మనం వ్యక్తులను నిందిస్తూనే ఉంటాం. దీనితో పాటు, మీరు ఎవరి నుంచి విమర్శించబడుతున్నారో అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. మీరు ఈ విధంగా ఆలోచించినప్పుడు, దేని గురించి బాధపడరు అని అంటున్నారు. విమర్శలను ఎలా నిర్వహించాలో మైండ్ కోచ్, సైకాలజిస్ట్ డాక్టర్ దామిని మాటల ద్వారా తెలుసుకుందాం..

ప్రశాంతమైన ప్రవర్తన

మిమ్మల్ని ఎవరైనా విమర్శించే సమయంలో మీకు కోపం రావడం స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ పరిస్థితిలో కోపానికి బదులు ఒక్కసారి సుదీర్ఘ, లోతైన శ్వాస తీసుకోవాలి. అంతేగాని ఎదుటి వ్యక్తి పట్ల ఏ విధంగానూ కోపంగా స్పందించకూడదు. అందుకు మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధంగా ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ప్రతీ విమర్శ వెనుక ఏదో ఒక మెసేజ్‌ ఉంటుంది

ప్రతి విమర్శ ఏదో నేర్పుతుందని డా.దామిని అంటున్నారు. తెలివైన వ్యక్తి విమర్శిస్తే, కోపం తెచ్చుకోకుండా అతని మాటలను సులభంగా అంగీకరించాలి.. అర్ధం చేసుకోవాలి. విమర్శ అంటే హృదయాన్ని గాయపరచడమే కాదు తప్పులను ఎత్తి చూపడం కూడా.

సానుకూల దృక్పథం

ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ తో విమర్శలను ఎదుర్కోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విమర్శలు మూడ్‌ని మారుస్తాయనేది నిజం. కానీ అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడం, కనీసం అప్పటి వరకు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలగాలి..

ఫీడ్‌బ్యాక్‌లా తీసుకోవాలి

విమర్శలను తప్పుడు మార్గంలో తీసుకోకుండా ఫీడ్‌బ్యాక్ మాదిరిగా తీసుకోవాలని డాక్టర్ దామిని అంటున్నారు. ఇది మిమ్మల్ని మీరు మెరుగ్గా తీర్చిదిద్దుకోవడంలో సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.