- Telugu News Photo Gallery Daily Exercise: Early Morning Or Evening, Which Is The Best Time For Exercise
Daily Exercise Timing: ఉదయం.. సాయంత్రం.. ఏ వేళలో ఎక్సర్‌సైజ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది?
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. కానీ చాలా మంది రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయలేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో లేదా వ్యాయామం చేయడానికి ప్లాన్ చేస్తున్న వారిలో సాధారణంగా ఓ అనుమానం తలెత్తుతుంది. అదేంటంటే.. ఉదయం లేదా సాయంత్రం ఏ వేళలో వ్యాయామం చేస్తే మంచిది?
Updated on: Apr 01, 2024 | 9:09 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. కానీ చాలా మంది రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయలేరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారిలో లేదా వ్యాయామం చేయడానికి ప్లాన్ చేస్తున్న వారిలో సాధారణంగా ఓ అనుమానం తలెత్తుతుంది. అదేంటంటే.. ఉదయం లేదా సాయంత్రం ఏ వేళలో వ్యాయామం చేస్తే మంచిది?

నిజానికి.. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీర జీవక్రియ రేటుకు మేలు జరుగుతుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం వ్యాయామం చేయడం వల్ల రోజంతా కేలరీలు బర్న్ అవుతాయి. దీనికి తోడు ఉదయం పూట వ్యాయామం చేస్తే మనసు మరింత శక్తివంతమవుతుంది. మానసిక స్థితి కూడా ఉల్లాసంగా ఉంటుంది. దాంతో పాటు రోజంతా పనుల్లో వేగం పుంజుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.

ఉదయం శారీరక వ్యాయామాలు చేస్తే, అది క్రమంగా అలవాటుగా మారే అవకాశం ఉంది. ఇది వ్యాయామం స్థిరత్వాన్ని కొనసాగించేలా చేస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే వ్యాయామం చేస్తే గాయాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మందికి అలసటగా కూడా అనిపిస్తుంది.

అయితే, సాయంత్రం వ్యాయామంలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఉదయం, సాయంత్రం శరీర కండరాల సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదయం, సాయంత్రం వ్యాయామం చేయడం వల్ల కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి. అందువల్ల ఏ సమయంలో వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనే విషయం చెప్పడం కష్ట తరం.

బదులుగా, రోజువారీ జీవితాన్ని, పనిలో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాయామం కోసం మీరే మంచి సమయాన్ని నిర్ణయించుకోండి. అది ఉదయం లేదా సాయంత్రం కావచ్చు. ఏది మీకు అనుకూలమైనదిగా భావిస్తే దానిని కొనసాగించండి. కానీ ముఖ్యమైనది ఏమిటంటే.. మీరు వ్యాయామం చేసినప్పుడు స్థిరంగా, ధైర్యంగా చేయండి. దీంతో శరీరం దృఢంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.