- Telugu News Photo Gallery Dark Lips Tips: Natural Home Remedies To Lighten Dark Lips, Follow These Tips And Tricks
Natural Home Remedies: నల్లని పెదాలు లేత గులాబీ రంగులో మారాలంటే.. ఈ ఒక్క పని చేయండి
చాలా మందికి పెదవులు నల్లగా ఉంటాయి. ఇష్టమైన లిప్‌స్టిక్ వేసుకున్నా పెదాలకు లుక్ రాదు. మునుపటిలా రంగు కనిపించదు. మరైతే పెదాలపై ఈ నల్లని ట్యాన్ ఎలా తొలగించుకోవాలి? అని ఆలోచిస్తున్నారా?.. ఈ కింది న్యాచురల్ హోమ్ రెమెడిస్ ఫాలో అయితే సరి. పెదాలను పింక్‌గా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆముదంతో మంచి ఫలితాలు పొందవచ్చు. ఆముదంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి..
Updated on: Apr 01, 2024 | 8:55 PM

చాలా మందికి పెదవులు నల్లగా ఉంటాయి. ఇష్టమైన లిప్‌స్టిక్ వేసుకున్నా పెదాలకు లుక్ రాదు. మునుపటిలా రంగు కనిపించదు. మరైతే పెదాలపై ఈ నల్లని ట్యాన్ ఎలా తొలగించుకోవాలి? అని ఆలోచిస్తున్నారా?.. ఈ కింది న్యాచురల్ హోమ్ రెమెడిస్ ఫాలో అయితే సరి.

పెదాలను పింక్‌గా మార్చడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆముదంతో మంచి ఫలితాలు పొందవచ్చు. ఆముదంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఒమేగా 6, 9 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఆముదం నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ నూనెను ప్రతిరోజూ ముఖానికి రాసుకుంటే అలర్జీ, మొటిమలు, మచ్చలు తదితర సమస్యలు దూరమవుతాయి. రోజూ పెదవులపై ఆముదం రాసుకుంటే కొద్ది రోజుల్లో పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి.

అయితే ఆముదం రాసుకోవడానికి సరైన మార్గాన్ని తెలుసుకోవాలి. అప్పుడే మీరు ప్రయోజనం పొందుతారు. ఇందుకోసం ఒకటి లేదా రెండు చుక్కల ఆముదం తీసుకుని పెదవులపై రాసుకుని మసాజ్ చేసుకోవాలి.

మీకు కావాలంటే, సహజ పదార్థాల సహాయంతో ఇంట్లోనే కాస్టర్ ఆయిల్ లిప్ బామ్‌ను తయారు చేసుకోవచ్చు. దీని కోసం ముందుగా పాన్‌లో షియా బటర్‌ను కరిగించి, ఆపై గ్యాస్‌ను ఆపివేయాలి. అది కరిగిన తర్వాత ఒక చెంచా ఆముదం, తేనె జోడించాలి. దీనిని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఈ లిప్ బామ్‌ని అప్లై చేస్తే కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.




