Papaya Seeds: క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు సర్వరోగాలకు దివ్యౌషధం.. రోజూ గంజిలో కాస్తింత కలుపుకుని తాగితే చాలు!

బొప్పాయి గింజల ప్రయోజనం తెలిస్తే వాటిని బంగారం కంటే భద్రంగా దాచేస్తారు. అవును మరి.. వీటితో క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు అన్ని రోగాలను నయం చేయవచ్చు. ఎలా తీసుకోవాలంటే..

Papaya Seeds: క్యాన్సర్ నుంచి కొలెస్ట్రాల్ వరకు సర్వరోగాలకు దివ్యౌషధం.. రోజూ గంజిలో కాస్తింత కలుపుకుని తాగితే చాలు!
Papaya Seeds
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 28, 2024 | 1:01 PM

బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, జింక్, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, కాల్షియంతో సహా ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. అలాగే బొప్పాయి గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్‌లు కూడా గణనీయమైన స్థాయిలో ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌లు. ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, వ్యాధులను నివారించడంలో చాలా సహాయపడతాయి. బొప్పాయి గింజల ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

వాపును తగ్గిస్తుంది

బొప్పాయి గింజల్లో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యు పాలీఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలన్నీ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల కలిగే మంటను తగ్గించడానికి, నిరోధించడానికి ఇవి సహాయపడతాయి.

క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ

బొప్పాయి గింజల్లో ఉండే పాలీఫెనాల్స్ శరీరానికి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ లక్షణాలు అనేక రకాల క్యాన్సర్ల నుంచి మీ శరీరాన్ని రక్షించడానికి పని చేస్తాయి. రోజూ 5 నుంచి 6 బొప్పాయి గింజలను చూర్ణం చేసి పాలు లేదా నీలల్లో కలిపి తాగవచ్చు.

ఇవి కూడా చదవండి

పీరియడ్స్ సమస్యలు దూరం

బొప్పాయిలోని కెరోటిన్‌లు ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్‌ల ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. అదేవిధంగా బొప్పాయి గింజలు రుతుక్రమాన్ని ఉత్తేజపరిచేందుకు, దాని క్రమాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే, ఇది పీరియడ్స్ నొప్పిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

గట్ ఆరోగ్యం

బొప్పాయి గింజలో ఉండే కార్బెన్ పేగుల్లో ఉండే పురుగులు, బ్యాక్టీరియాను చంపి మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బొప్పాయి గింజల్లో ఉండే అధిక పీచు పదార్థం ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

సాధారణంగా ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ప్రకారం బొప్పాయి గింజల్లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు బొప్పాయి గింజల్లో ఉండే ఒలేయిక్ యాసిడ్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి.

బొప్పాయి గింజను ఎలా తినాలంటే

బొప్పాయి గింజలను తినడానికి, ముందుగా వాటిని రుబ్బుకోవాలి. అనంతరం పాలు, గంజి వంటి వాటితో కలిపి తాగవచ్చు. అంతే కాకుండా ఈ పొడిని వేడి నీటిలో కూడా కలుపుకుని తాగవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!