Nutmeg Water: రాత్రి నిద్రకు ముందు జాజికాయ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

నేటి తరం వారికి జాజికాయ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇంట్లో పెద్దవాళ్లను అడిగితే తెలుస్తుంది.. దీని గొప్పతనం. పసి పిల్లల నుంచి పెద్దల వరకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఒకే ఒక్క నివారిణి జాజికాయ. జాజికాయ పొడిని చిటికెడు నీళ్లలో కలిపి రోజూ నిద్రకు ముందు గ్లాసుడు తాగారంటే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు పరారవుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

Nutmeg Water: రాత్రి నిద్రకు ముందు జాజికాయ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
Nutmeg Water
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 02, 2025 | 1:37 PM

ఆయుర్వేధంలో జాజికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో రోగాలను సహజ సిద్ధంగా నయం చేయడంలో జాజికాయ ప్రభావవంతంగా పని చేస్తుంది. చిటికెడు జాజికాయ పొడి కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేధ నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య సంబంధిత సమస్యలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ జాజికాయ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలట. జాజికాయ నీటిలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ డి వంటి మంచి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం

గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా జాజికాయ నీటిని వారి రోజువారీ డైట్ ప్లాన్‌లో భాగం చేసుకోవాలి. జాజికాయ నీటిలో ఉండే పదార్థాలు పేగు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతే కాకుండా నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు ఔషధ గుణాలున్న ఈ డ్రింక్ సహాయం చేస్తుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది

మీకు కూడా అధిక రక్తపోటు ఉందా? మీ సమాధానం అవును అయితే.. పొటాషియం అధికంగా ఉండే జాజికాయ నీటిని క్రమం తప్పకుండా తాగడం అలవాటు చేసుకోవల్సిందే. తద్వారా మీ రక్తపోటును నియంత్రించవచ్చు. నోటి దుర్వాసన పోవాలంటే జాజికాయ నీళ్లు తాగాల్సిందే. అంతేకాకుండా, జాజికాయ నీరు మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ సహజ పానీయం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు త్రాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మంచి ఆరోగ్య ఫలితాలను పొందడానికి రాత్రి పడుకునే ముందు జాజికాయ పొడి కలిపిన నీటిని సేవించాలి. జాజికాయ నీరు మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుంది. అయితే ఈ నేచురల్ డ్రింక్ ను సరైన మోతాదులో, సరైన రీతిలో తీసుకోవడం వల్ల మాత్రమే దీని ప్రయోజనాలను పొందడం సాధ్యమవుతుంది.

జాజికాయ నూనె

జాజికాయ నూనె రుచి కూడా చాలా మేలు చేస్తుంది. దీనిని వంటలలో తక్కువగా ఉపయోగించాలి. ఈ నూనెలో ఎక్కువగా ఔషధ, సౌందర్య కారకాలు ఉంటాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి అధిక ప్రాముఖ్యత ఉంది. జాజికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని మోనోటెర్పెనెస్ అంటారు. దీనితో పాటు, ఇందులో సబినెన్, టెర్పినోల్, పినేన్ కరాకాలు కూడా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి శరీరంలో దీర్ఘకాలిక శోథ ఆరోగ్య పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి చర్మంపై మొటిమలు, మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. జాజికాయ నూనెను అరోమాథెరపీకి కూడా ఉపయోగించవచ్చు. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. దీఈ నూనెను ఉపయోగించడానికి కాటన్ బాల్‌ వినియోగించాలి.

గమనిక: ఇక్కడ ఉన్న విషయాలు సమాచారం కోసం మాత్రమే. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.