Norovirus: అమెరికాలో విజృంభిస్తున్న నోరోవైరస్ .. లక్షణాలు ఏమిటి? ఎందుకు వ్యాపిస్తోందంటే

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో చోట ఏదోక వైరల్ బయటపడుతూనే ఉంది. మానవాళిని భయపెడుతూనే ఉంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ ముప్పు పెరుగుతోంది. నోరోవైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇది ఒక అంటు వ్యాధి. అమెరికాలో డిసెంబర్ నుంచి నోరోవైరస్ కేసులు నిరంతరంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ ఏమిటి? దాని లక్షణాలు ఏమిటి? వ్యాప్తి చెందకుండా ఎలా నివారించాలో తెలుసుకుందాం..

Norovirus: అమెరికాలో విజృంభిస్తున్న నోరోవైరస్ .. లక్షణాలు ఏమిటి? ఎందుకు వ్యాపిస్తోందంటే
Norovirus
Follow us
Surya Kala

|

Updated on: Jan 02, 2025 | 1:14 PM

అమెరికాలో నోరోవైరస్ కేసులు పెరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఇప్పటివరకు 90కి పైగా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ అనేది వేగంగా వ్యాపించే వ్యాధి. కొన్ని సందర్భాల్లో ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. అమెరికాలోని అనేక ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. నోరోవైరస్ అంటే ఏమిటి? ఈ వైరస్ లక్షణాలు, వ్యాపించకుండా నివారణ చర్యలను గురించి తెలుసుకుందాం..

నోరోవైరస్ కడుపు, ప్రేగులను ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా వైరస్‌ను గ్యాస్ట్రోఎంటెరిటిస్ అని కూడా అంటారు. ఈ వైరస్ సోకిన వ్యక్తి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలతో ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాల్లో తలనొప్పి, తీవ్రమైన అలసట సమస్య కూడా ఉంటుంది. ఈ వ్యాధి కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాదు ఈ వ్యాధి సోకిన వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నా మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ నోరోవైరస్ కేసులు కలుషిత ఆహారం తినడం వలన వస్తుందని చెబుతున్నారు. నోరోవైరస్ కు సరైన చికిత్స లేదు. వ్యాధి లక్షణాల ఆధారంగా రోగికి చికిత్స అందిస్తారు.

అమెరికాలో నోరోవైరస్ ఎందుకు వ్యాపిస్తోందంటే..?

నోరోవైరస్ అనేది కొత్త వైరస్ కాదని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జుగల్ కిషోర్ అంటున్నారు. ఇది దశాబ్దాల నాటి వైరస్ అని చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన మొదటి కేసు 1968లో ఒహియోలోని నార్వాక్‌లో నమోదైంది. ఒక పాఠశాలలో స్టూడెంట్లో ఈ వైరస్ ను గుర్తించారు. ఆ సమయంలో కనుగొనబడిన ఈ వైరస్ జాతిని నార్వాక్ వైరస్ అని పిలిచేవారు. తరువాత దాని పేరు నోరోవైరస్ గా మారింది.

ఇవి కూడా చదవండి

అమెరికాలో నోరోవైరస్ ఒక సాధారణ వ్యాధి అని.. ఈ వైరస్ సోకిన కేసులు అక్కడక్కడ వస్తూనే ఉన్నాయని డాక్టర్ కిషోర్ చెప్పారు. ఈ వైరస్ కడుపు, ప్రేగులను ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు సాధారణంగా 1 నుంచి 2 రోజులలో కనిపిస్తాయి. ఒక వారం పాటు ఉండవచ్చు. అయితే ఈ నోరోవైరస్ ప్రాణాంతకం కాదు. లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా సులభంగా నివారించవచ్చు. అయితే వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలకు ఈ వైరస్ నుంచి రక్షణ అవసరం. ప్రస్తుతం అమెరికాలో ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో ఈ వైరస్ వలన పెద్దగా ముప్పు లేదు.

నోరోవైరస్ వ్యాప్తిని ఎలా నివారించాలంటే

  1. నోరోవైరస్ వ్యాధి సోక కుండా క్రమం తప్పకుండా చేతులను శుభ్రపరచుకోండి.
  2. కలుషితమైన ఆహారం తినొద్దు. కలుషితమైన నీరు తాగవద్దు.
  3. ఈ నోరోవైరస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉండకండి. దూరంగా ఉండండి.
  4. ఎవరికైనా కడుపు సంబందిత ఇబ్బందులు ఉంటె ..ఆ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..