ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ మధ్య చెదిరిన మిత్రబంధం.. పాక్‌లో అధికారాన్ని చేజిక్కించుకోనేందుకు తాలిబాన్ ఫ్లాన్?

ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దు పోరాటం పాకిస్థానీలను విభజించింది. హింసాత్మక దాడులతో రెండు మిత్ర దేశాల మధ్య దూరం పెరిగింది. ఉత్తర వజీరిస్థాన్ జిల్లాపై డిసెంబర్ 21న జరిగిన దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్‌లోని TTP రహస్య స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది. మహిళలు, పిల్లలతో సహా కనీసం 46 మంది పౌరులను పాక్ సైన్యం చంపిందని తాలిబాన్ ప్రభుత్వం ఆరోపించింది.

ఆఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌ మధ్య చెదిరిన మిత్రబంధం.. పాక్‌లో అధికారాన్ని చేజిక్కించుకోనేందుకు తాలిబాన్ ఫ్లాన్?
Taliban , Afghanistan, Pakistan
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 02, 2025 | 12:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికే అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు.. తాజాగా పొరుగున ఉన్న పాకిస్థాన్‌పై కన్నేశారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఇబ్బంది కలిగించేందుకు పాక్ వరకు విస్తరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. తాజా నివేదిక ప్రకారం.. ఉగ్రవాదులు ఇప్పటికే పాక్ సైనిక పోస్టును ఆక్రమించుకుని అక్రమంగా దేశంలోకి చొరబడుతున్నారు. అయితే, ఒకప్పుడు తీవ్రవాదులకు గొప్ప పోషకుడిగా భావించే పాకిస్థాన్‌కు, ఉగ్రవాదులకు ప్రధాన శిక్షణా కేంద్రంగా పేరొందిన ఆఫ్ఘనిస్థాన్‌కు మధ్య ఈ పరిస్థితి ఎందుకు పెరిగిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకప్పుడు సన్నిహిత సంబంధాలను పంచుకున్న ఈ రెండు దేశాలు-సాంస్కృతిక, కుటుంబ బంధాలతో పాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలిటెంట్ల పరంగా పరస్పర మద్దతుతో సహా-ఇప్పుడు పరస్పర విధ్వంసం అంచున ఉన్నాయి.

గత వారం జరిగిన ఘోరమైన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని అనేక పాయింట్లను తమ బలగాలపై దాడి జరిగిందని,ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు పక్తికా ప్రావిన్స్‌లో శిక్షణా కేంద్రాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటుదారులను హతమార్చేందుకు పాకిస్థాన్ గత మంగళవారం ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఘటనలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. ఎక్కువగా మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 19 మంది సైనికులను హతమార్చడంతో పాటు డ్యూరాండ్ లైన్ సమీపంలోని పాకిస్తాన్ సైనిక పోస్టులను తాలిబాన్ ఇటీవలి ప్రతిదాడులు, స్థావరాల స్వాధీనం చేసుకోవడం పాకిస్తాన్ గిరిజన ప్రాంతాలలో పెరుగుతున్న తీవ్రవాద ముప్పును స్పష్టం చేస్తోంది.

తాలిబాన్ మంత్రిత్వ శాఖ దాడులు ఎలా జరిగాయి. ఇరువైపులా ఏవైనా ప్రాణనష్టం జరిగిందా అనే దానిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, ఈ దాడుల్లో 19 మంది పాకిస్థానీ సైనికులు, ముగ్గురు ఆఫ్ఘన్ పౌరులు మరణించారని మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ తాలిబాన్ అనుకూల మీడియా సంస్థ హుర్రియత్ డైలీ న్యూస్ పేర్కొంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి ఎవరూ వ్యాఖ్యానించడానికి వెంటనే అందుబాటులో లేదు. ఆర్గనైజర్ రషీదుల్లా హమ్దార్ద్ ప్రకారం, దేశంలోని ఆగ్నేయ ఖోస్ట్ ప్రావిన్స్‌లో ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ ప్రతీకార చర్యను జరుపుకున్నారు. మరోవైపు సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి తాలిబాన్ తగినంతగా బలంలేదని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.

ఇదిలావుంటే, తాలిబాన్ – పాకిస్తాన్ మధ్య శత్రుత్వం భారతదేశానికి వ్యూహాత్మక ప్రయోజనం కావచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభావాన్ని బలహీనపరచడానికి, సరిహద్దు ఉగ్రవాదాన్ని అరికట్టడానికి వీలు కల్పిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత సంఘర్షణలలో చిక్కుకోకుండా తన ప్రాంతీయ స్థితిని పెంచుకోవడానికి ఈ మార్పును ఉపయోగించుకుని భారతదేశం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సమర్థవంతమైన దౌత్యం, వ్యూహాత్మక సహనం, ఆఫ్ఘనిస్తాన్‌తో సత్సంబంధాలు పెంచుకోవడం కీలకం అంటున్నారు రాజకీయవేత్తలు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..