Viral Video: షాకింగ్ సీన్..దుకాణంలోకి దూసుకెళ్లిన కారు… ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!
కారు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. చూస్తుండగానే జరగకూడని నష్టం జరిగిపోతుంటుంది. ప్రస్తుతం అలాంటిదే సోషల్ మీడియాలో ఓ షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . కాలిఫోర్నియాలోని...

కారు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా భయంకరంగా ఉంటాయి. చూస్తుండగానే జరగకూడని నష్టం జరిగిపోతుంటుంది. ప్రస్తుతం అలాంటిదే సోషల్ మీడియాలో ఓ షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్ నగరంలోని హార్డ్‌వేర్ దుకాణంలోకి ఓ కారు వేగంగా దూసుకెళ్లి గాజు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ ఫుటేజ్‌లో ఒక ఉద్యోగి వాహనం ఢీకొనకుండా తృటిలో తప్పించుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ప్రమాదం చాలా బలంగా ఉండటంతో వాహనం దుకాణం లోపలికి మంటలు చెలరేగాయి. ప్రత్యక్ష సాక్షులు తమ కళ్ళ ముందు అగ్నిగోళాన్ని చూసినట్లు వివరించారు. ఈ భయంకరమైన ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఉన్నవారు ఇప్పటికీ షాక్ లో ఉన్నారు.
మేము షాక్ కు గురయ్యాము. షాక్ నుంచి తేరుకోగానే వీలైనంత వేగంగా బయటకు పరిగెత్తాము. మేము బతికి ఉండటం ఒక అద్భుతమే. కారు ఢీకొన్న వెంటనే మాకు ఒక అగ్నిగోళం కనిపించింది అని అక్కడి ఉద్యోగులు అన్నారు.
మీడియా నివేదికల ప్రకారం, బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని కేవలం 20 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చింది. అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ దుకాణం మాత్రం తీవ్రంగా ధ్వంసం అయింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ ఎలా కోల్పోయాడనే దానిపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
