AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీ గుండె షెడ్డుకు వెళుతున్నట్లే..

చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. వేసవిలో కంటే ఈ సీజన్‌లో గుండెపోటు ముప్పు ఎక్కువ. గుండె ఆగిపోవడమే గుండెపోటుకు ప్రధాన కారణం. అటువంటి పరిస్థితిలో, మీరు దాని లక్షణాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.. హార్ట్ బ్లాకేజ్ లక్షణాలు ఎలా ఉంటాయి..? నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ విషయాలను తెలుసుకోండి..

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, మీ గుండె షెడ్డుకు వెళుతున్నట్లే..
Heart Attack
Shaik Madar Saheb
|

Updated on: Jan 02, 2025 | 3:38 PM

Share

చలి తీవ్రత పెరిగింది.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన చలిని అనుభవిస్తున్నాయి. అయితే, ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. వేసవితో పోలిస్తే ఈ సీజన్‌లో గుండెపోటు ముప్పు 30 శాతం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. గుండెపోటుకు ప్రధాన కారణం గుండె సిరల్లో అడ్డుపడటం.. అడ్డుపడటం వల్ల కూడా గుండె (హార్ట్ బ్లాకేజ్) ఆగిపోవచ్చు. చలికాలంలో గుండెజబ్బులు ఎందుకు వస్తాయి..? హార్ట్ బ్లాకేజ్ లక్షణాలు ఏమిటో తెలుసుకోండి..

శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత కారణంగా గుండె సిరలు (కుంచించుకుపోతాయి) తగ్గిపోతాయి. దీనివల్ల రక్తప్రసరణ సరిగా జరగదు. రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల గుండెపోటు లేదా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. సిరలు మూసుకుపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు గుండె ఆగిపోయే లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వీటిని సకాలంలో గుర్తిస్తే గుండెపోటు ముప్పు నుంచి సులభంగా బయటపడొచ్చు.. లేదా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు..

గుండె ఆగిపోవడం లక్షణాలు ఏమిటి..?

ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హార్ట్‌ బ్లాక్‌లో ఎక్కువగా కనిపించే లక్షణం ఛాతీ నొప్పి.. దీనిలో మీరు తరచుగా ఛాతీపై ఒత్తిడి లేదా బిగుతుగా భావిస్తారు. మీకు గ్యాస్ సమస్య లేకుంటే.. దీర్ఘకాలంగా ఛాతీ నొప్పి కొనసాగితే వెంటనే ఆసుపత్రికి వెళ్లండి.

గుండె ఆగిపోవడం ఇతర లక్షణాల గురించి మాట్లాడితే.. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.. ప్రత్యేకించి మీరు తేలికపాటి వ్యాయామం చేసినప్పుడు లేదా కొంచెం వేగంగా నడుస్తున్నప్పుడు.. మీ గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా వేగంగా మారుతుంది.. ఇది కూడా అడ్డుపడటం లక్షణం కావచ్చు.

ముఖ్యంగా మీరు వ్యాయామం చేసినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు గుండెలో అడ్డంకులు ఏర్పడటం దీనివల్ల అలసట రావడం దీని లక్షణాలని నిపుణులు చెబుతున్నారు.

గుండె అడ్డంకి (హార్ట్ బ్లాకేజ్) ని ఎలా నివారించాలి

మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

ధూమపానానికి దూరంగా ఉండండి.

మానసిక ఒత్తిడికి గురికావద్దు.

సంవత్సరానికి ఒకసారి గుండె చెకప్ చేయించుకోండి

మద్యం వినియోగం పరిమితం చేయండి.. లేదా మానేయండి.

అయితే.. గుండె జబ్బుల విషయంలో ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స పొందండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
దానిమ్మ పండు కంటే ఆకులోనే ఉంది అసలు ఆరోగ్యం..! లాభాలు తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
రోజూ అరటిపండ్లు తింటే మీ బాడీలో జరిగే అద్భుతాలు ఇవే.. తెలిస్తే..
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
ముగ్గురి ప్రాణాలు తీసిన దట్టమైన పొగమంచు..!
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పదిసార్లు పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
పాత ఫోన్ విక్రయిస్తున్నారా? ఈ మిస్టేక్స్ చేస్తే భారీగా నష్టపోతారు
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
మీకు చలి ఎక్కువ అనిపిస్తుందా.. ఈ విటమిన్ లోపమే కారణం.. అసలు విషయం
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
52 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ బాడీతో టాలీవుడ్ హీరో.. ఫొటోస్ వైరల్
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..
ఈకేవైసీ చేసుకోకపోతే రేషన్ కట్..! ప్రభుత్వం క్లారిటీ..
ఎగ్‌వైట్‌ తిని ఎల్లో వదిలేస్తున్నారా..? ఈ పోషకాలు కోల్పోయినట్లే..
ఎగ్‌వైట్‌ తిని ఎల్లో వదిలేస్తున్నారా..? ఈ పోషకాలు కోల్పోయినట్లే..
మురిద్ ఎయిర్‌బేస్‌ను టార్పాలిన్‌తో కప్పి ఏం చేస్తున్నారు..?
మురిద్ ఎయిర్‌బేస్‌ను టార్పాలిన్‌తో కప్పి ఏం చేస్తున్నారు..?