రోజుకు 10 గంటలకు పైగా కూర్చుంటే మరణ ముప్పు!

TV9 Telugu

02 January 2025

ప్రస్తుతకాలంలో జీవనశైలి కారణంగా ఆఫీసులో కంప్యూటర్ ముందు గంటలు తరబడి కూర్చొని పని చెయ్యాల్సి వస్తుంది.

కదలిక లేని లైఫ్‌స్టైల్‌తో ప్రాణాపాయమని ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనంలో వెల్లడి కావడం ఆందోళన రేపుతోంది.

నిశ్చలమైన లైఫ్ స్టైల్‌ ఆరోగ్యానికి అంతమంచిది కాదని తెలిసినా ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ గంటలు కూర్చుని పని చేయక తప్పడం లేదు.

దీంతో కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేస్తుంటారు. అయితే, రోజుకు పదిన్నర గంటలకు పైగా కూర్చునే వారిని వ్యాయామం కూడా కాపాడలేదట

మిగతా వారితో పోలిస్తే రోజులో 10.6 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తేలింది.

వారానికి సిఫార్సు చేసిన 150 నిమిషాల వ్యాయామం చేసినప్పటికీ ఇటువంటి వారిలో ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.

రోజులో పదిన్నర గంటలకుపైగా కూర్చునే వారిలో గుండె వైఫల్యం కారణంగా 15 శాతం, హృద్రోగాలతో మరణించే అవకాశం 33 శాతం ఎక్కువని తెలిపింది.

వ్యాయామం అలవాటు లేని వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువని అధ్యయనం తెలిపింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.