లవంగాలు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటినొప్పి వంటి సమస్యలు నయం అవుతాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి
TV9 Telugu
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి ఫ్రీరాడికల్స్‌తో పోరాడి బరువుని తగ్గిస్తాయి. వీటిల్లోని ఎలాజిక్ ఆమ్లాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా కాపాడతాయి
TV9 Telugu
అయితే లవంగాలు రుచికి ఘాటుగా ఉంటాయి. వీటిని నేరుగా తినలేం. కాబట్టి లవంగాలను కొంచెం బెల్లంతో తినొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా బెల్లం- లవంగాలు కలిపి తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి..
TV9 Telugu
బెల్లం, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి విటమిన్ బి, ఎ, సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు లభిస్తాయి
TV9 Telugu
బెల్లం, లవంగాలు రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం అవుతుంది. వీటిని కలిపి తింటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు నయమవుతాయి
TV9 Telugu
లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గొంతులో శ్లేష్మం తొలగిపోతుంది
TV9 Telugu
బెల్లం, లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఈ కారకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి
TV9 Telugu
బెల్లం, లవంగాలు తీసుకోవడం వల్ల శ్వాసకోశ నాళాలు శుభ్రపడతాయి. ఉబ్బసం, బ్రోన్కైటిస్ వంటి సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగించి, చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు సహాయపడతాయి