Side Effects of Ajwain: ప్రతి రోజూ వాము తింటున్నారా?.. విషయం తెలిస్తే అదిరిపోతారు..!
Side Effects of Ajwain: వాము గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దినుసుల్లో భాగమైన వామును వంటకాలతో పాటు.. ఔషధంగానూ వినియోగిస్తూ వస్తున్నాం.
Side Effects of Ajwain: వాము గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మసాలా దినుసుల్లో భాగమైన వామును వంటకాలతో పాటు.. ఔషధంగానూ వినియోగిస్తూ వస్తున్నాం. వాము వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదర సంబంధిత సమస్యలు, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కోసం వామును విరివిగా వాడుతారు. అంతేకాదు.. ఇందులో వివిధ రకాల ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైరెక్ట్‌గానూ, నీటిలో నానబెట్టి కూడా తింటారు. అయితే, ఇది అవసరానికి తగినట్లు తింటే మంచిదే.. కానీ, అవసరానికి మించి తింటే మాత్రం పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ వామును అధికంగా తీసుకోవడం వలన కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. దీర్ఘకాలికంగా గ్యాస్, గుండెల్లో మంట సమస్యలతో బాధపడేవారు వామును అధికంగా తీసుకుంటారు. అయితే, అతిగా తీసుకుంటే.. గుండెల్లో మంట తగ్గించడానికి బదులుగా.. యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. గ్యాస్ సమస్య వేధిస్తుంది. 2. చాలా మందికి అలర్జీ ఉంటుంది. అలర్జీ ఉన్నవారు పొరపాటున వాము తింటే.. తల తిరగడం, వికారం వంటి సమస్యలు వస్తాయి. 3. వాము నోటిలో మంట కలిగించే అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి. అయితే, దీనిని అతిగా తినడం వలన నోట్లో పుండ్లు అవుతాయి. అందుకే వామును మితంగా తీసుకోవాలి. 4. గర్భంతో ఉన్నవారు వాముకు దూరంగా ఉండటం మంచిది. వాము.. పిండం అభివృద్ధిని అడ్డుకుంటుంది.
Also read:
Optical Illusion: ఈ ఫోటోలో అద్భుత రహస్యం దాగుంది.. డేగ కళ్లు మాత్రమే కనిపెట్టగలవు.. మరి మీరూ..!
Viral Video: అంతరిక్షంలో తడి టవల్‌ను పిండితే ఏం జరుగుతుందో తెలుసా?.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Viral Video: ఐడియా అదిరందయ్యా చంద్రం.. కొత్త పెళ్లి కొడుకు కొత్త జోష్.. వీడియో చూస్త అవాక్కవుతారు..!