AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ ఊచకోత.. టాప్-5లోకి రాహుల్.. పర్పుల్ క్యాప్ మాత్రం మనోడిదే

IPL 2026 : ఐపీఎల్ 2026 లో ఆరెంజ్ క్యాప్ రేసులోకి విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూసుకొచ్చారు. వికెట్ల వేటలో భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 486 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు.

IPL 2026 : ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ ఊచకోత.. టాప్-5లోకి రాహుల్.. పర్పుల్ క్యాప్ మాత్రం మనోడిదే
Orange Cap Purple Cap
Rakesh
|

Updated on: May 18, 2026 | 7:02 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ కేవలం జట్ల మధ్యే కాదు.. ఆటగాళ్ల మధ్య కూడా క్యాప్‎ల వేట రసవత్తరంగా మారింది. ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచుల తర్వాత ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు) జాబితాలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, క్లాస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తమ పరుగుల దాహంతో టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 58 పరుగులు బాది విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఇప్పటివరకు 13 మ్యాచుల్లో 542 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ కంటే ముందు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు సాయి సుదర్శన్ (554 రన్స్), శుభ్‌మన్ గిల్ (552 రన్స్) మాత్రమే ఉన్నారు. మరోవైపు రాజస్థాన్‌పై హాఫ్ సెంచరీ బాదిన కేఎల్ రాహుల్ 530 పరుగులతో నాలుగో స్థానానికి ఎగబాకాడు. వీరిద్దరూ తలో సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో నిలకడగా రాణిస్తున్నారు. ఇక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 486 పరుగులతో ఆరో స్థానంలో ఉండి, అందరికంటే అత్యధిక స్ట్రైక్ రేట్ (234.78)తో భీభత్సం సృష్టిస్తున్నాడు.

వికెట్ల వేటలో  భువనేశ్వర్ కుమార్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. 13 మ్యాచుల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్‌ను తన దగ్గరే భద్రపరుచుకున్నాడు. భువీ తర్వాతి స్థానంలో పంజాబ్ కింగ్స్ పేసర్ కగిసో రబడా (21 వికెట్లు) ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ 19 వికెట్లతో మూడో స్థానంలో ఉండి గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రిన్స్ యాదవ్, రషీద్ ఖాన్ తలో 16 వికెట్లతో టాప్-5లో నిలిచి బౌలర్ల విభాగంలో పోరును ఆసక్తికరంగా మార్చారు.

వ్యక్తిగత రికార్డులే కాకుండా, ఆయా ఆటగాళ్ల ప్రదర్శనలు జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. కోహ్లీ ఫామ్ ఆర్‌సీబీకి కొండంత అండగా నిలుస్తుంటే, రాహుల్ పరుగుల వేట ఢిల్లీకి ఆశలు కల్పిస్తోంది. బౌలింగ్‌లో భువీ స్వింగ్ మ్యాజిక్ సన్ రైజర్స్ జట్టుకు ప్లస్ పాయింట్‌గా మారింది. లీగ్ దశలో మిగిలిన కొన్ని మ్యాచుల్లో ఈ రేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us