Viral Video: ఐడియా అదిరందయ్యా చంద్రం.. కొత్త పెళ్లి కొడుకు కొత్త జోష్.. వీడియో చూస్త అవాక్కవుతారు..!

Viral Video: మార్చి నెల ప్రారంభం నుంచే దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అట్టుడికిపోతున్నారు.

Viral Video: ఐడియా అదిరందయ్యా చంద్రం.. కొత్త పెళ్లి కొడుకు కొత్త జోష్.. వీడియో చూస్త అవాక్కవుతారు..!
Viral Photo
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2022 | 9:00 PM

Viral Video: మార్చి నెల ప్రారంభం నుంచే దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అట్టుడికిపోతున్నారు. ఎండవేడిమిని తాళలేక అతలాకుతలం అవుతున్నారు. చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం, శరీరానికి చలువ చేసే డ్రింక్స్ తాగడం, రోజుకు మూడుసార్లు స్నానం చేయడం వంటివి చేస్తున్నారు. ఇక తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన వారు.. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ వెంట వాటర్ బాటిల్, ఎండ నుంచి రక్షణ కోసం గొడుగు వంటి సేఫ్టీ టిప్స్ పాటిస్తున్నారు. గొడుగు పెట్టుకోవడం వలన ఎండ నుంచి బయటపడొచ్చు.

ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎండలు ఎంతున్న పెళ్లిళ్లు ఆగవు కదా. ఎండలను తట్టుకునేందకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. తాజాగా ఓ పెళ్లి బృందం కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ పెళ్లి బృందం ఐడియా అదిరిపోయిందనే చెప్పాలి. వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ పెళ్లి మండపానికి తరలించాలి. అయితే, ఎండలు తీవ్రస్థాయిలో ఉండటంతో పెళ్లి నిర్వాహకులు సరికొత్త ఐడియా అమలు చేశారు. పెళ్లి బృందం వరకు పెద్ద పరదాను ఏర్పాటు చేశారు. చతురస్రాకారంలోని టెంటుకు నాలుగు మెటల్ ఫ్రేమ్స్‌ ఏర్పాటు చేసి.. వాటిని నాలుగు దిక్కులు పట్టుకునేందుకు నలుగురు మనుషులను ఏర్పాటు చేశారు. ఇలా టెంటును ముందుకు తీసుకెళ్తూ.. ఎండ నుంచి సేఫ్ అయ్యేందుకు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. అయితే, పెళ్లి బృందం ఇలా వెళ్తుండటాన్ని గమనించిన కొందరు స్థానికులు దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బందించారు. ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అదిరిందయ్యా చంద్రం.. కొత్త పెళ్లి కొడుకు.. కొత్త జోష్‌లో వెళ్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సూపర్ వీడియోను మీరూ చూసేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Sinus Pain Relief Tips: ఈ ఒక్క గ్లాస్ జ్యూస్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. మ్యాజిక్ సొల్యూషన్ ఇప్పుడే తెలుసుకోండి..!

Viral News: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Viral News: కొంపముంచిన కుక్క.. ఏకంగా లక్షా యాభై వేలు యామం.. అసలు ఏం జరిగిందంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!