Viral News: కొంపముంచిన కుక్క.. ఏకంగా లక్షా యాభై వేలు మాయం.. అసలు ఏం జరిగిందంటే..?

Viral News: ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా రూ. 1.50 లక్ష యాభై వేల రూపాయల నగదు కుక్క ఎత్తుకు పోయింది. ఏంటీ వింటుంటే విడ్డురంగా ఉంది కదూ.. కానీ యాజమానికి మైండ్ బ్లాంక్..

Viral News: కొంపముంచిన కుక్క.. ఏకంగా లక్షా యాభై వేలు మాయం.. అసలు ఏం జరిగిందంటే..?
Dog
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2022 | 7:19 PM

Viral News: ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా రూ. 1.50 లక్ష యాభై వేల రూపాయల నగదు కుక్క ఎత్తుకు పోయింది. ఏంటీ వింటుంటే విడ్డురంగా ఉంది కదూ.. కానీ యాజమానికి మైండ్ బ్లాంక్ అయ్యేలా పెంపుడు కుక్క ఇచ్చిన ఈ షాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుక్కే కదా అని చీఫ్ గా చూస్తే కొంపముంచింది. దాంతో లక్షన్నర కోల్పోయిన బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఆ డబ్బు ఏమైపోయిందో.. ఎక్కడ పడేసిందో తెలియక యజమానితో పాటు, ఊరంతా గాలిస్తున్నారు. వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ విచిత్ర సంఘటన ప్రతి ఒక్కరినీ నివ్వేరపోయేలా చేసింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని నాచినపల్లి గ్రామంలో చేరాలు అనే ఓ గొర్రెల కాపారి పెంచుకుంటున్న కుక్క ఊహించని షాక్ ఇచ్చింది. తన యజమాని దాచుకున్న రూ. 1.50 లక్షల నగదు సంచిన ఎత్తుకెళ్ళి ఎక్కడో పడెసింది. కాసు చేరాలు గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తన మందలోని కొన్ని గొర్రెలను అమ్మాడు. వచ్చిన డబ్బును సంచిలో పెట్టి తన నడుముకు కట్టుకున్నాడు. ఎప్పటిలాగే తన నడుంకు కట్టుకున్న డబ్బుల సంచిని ఓ పక్కన పెట్టి స్నానానికి వెళ్ళాడు. వచ్చి చూసే సరికి తన పెంపుడు కుక్క, పైసల సంచి కనపడలేదు.

ఐతే తన పెంపుడు కుక్కకు నోటికి అందిందల్లా ఎత్తుకెల్లే అలవాటు ఉంది. చెప్పులు, బట్టలు, ఇతర వస్తువులు కూడా ఎత్తుకెళ్లి ఎక్కడెక్కడో పడేస్తుంది. ఆ అలవాటు ప్రకారమే పైసలు కట్టి ఉన్న సంచిని ఎత్తుకెళ్లింది. ఆ డబ్బు సంచిని కుక్క ఎవ్వరి ఇంటి దగ్గర విడిచి పెట్టిందో అంతు చిక్కడం లేదు. గ్రామం అంతా గాలించినా ఫలితంలేదు. దాంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. పెంపుడు కుక్క చేసిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ దొరకలేదు.. గ్రామ సర్పంచ్ వాట్సప్ గ్రూప్ ధ్వారా గ్రామంలో అందరికి తెలిసేలా చేసినా ఫలితం లేదు. దింతో తలపట్టుకొని కూర్చున్న యాజమాని ఆ కుక్కను బుజ్జగించే పనిలో పడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Viral News: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Sinus Pain Relief Tips: ఈ ఒక్క గ్లాస్ జ్యూస్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.. మ్యాజిక్ సొల్యూషన్ ఇప్పుడే తెలుసుకోండి..!

Mango Kernels Benefits: మామిడిపండు తిని గింజ పడేస్తున్నారా? ఈ 5 బెనిఫిట్స్ తెలిస్తే ఇక అలా చేయరు..!