PhonePe: బంగారం ప్రియులకు మెగా క్యాష్ బ్యాక్.. అక్షయ తృతీయకు ఫోన్ పే భారీ డిస్కౌంట్..

PhonePe: దేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా తన వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. ఈ పండుగ సమయంలో యాప్ ద్వారా కొనుగోలు చేసే బంగారం, వెండి కొనేవారికి ఇవి అందుబాటులో ఉంటాయి.

PhonePe: బంగారం ప్రియులకు మెగా క్యాష్ బ్యాక్.. అక్షయ తృతీయకు ఫోన్ పే భారీ డిస్కౌంట్..
Gold And Silver
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 28, 2022 | 7:04 PM

PhonePe: దేశంలోని ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భంగా తన వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌లను ప్రకటించింది. ఈ పండుగ సమయంలో యాప్ ద్వారా కొనుగోలు చేసే బంగారం, వెండిపై అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. వినియోగదారులు యాప్ ద్వారా 24 క్యారెట్ల బంగారం, వివిధ డిజైన్ల రూపంలో నాణేలు(Gold Coins) లేదా బార్ల రూపంలో డెలివరీని పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా బంగారం కొనుగోలుపై అదనంగా రూ. 2,500 క్యాష్ బ్యాక్ వినియోగదారులు పొందవచ్చు. అదే వెండి నాణేలు లేదా బార్‌లను కొనుగోలు చేసేవారికి రూ.250 వరకు క్యాష్‌బ్యాక్‌ అందింస్తోంది. ఈ ఆఫర్ కేవలం మే3, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

ఫోన్ పేలో 99.99% స్వచ్ఛమైన వెండి, బంగారం వినియోగదారులకు అందుబాటులో ఉంది. విస్తృతమైన డిజైన్ ఆప్షన్స్ అండ్ డినామినేషన్‌లు ఈ పండుగ సీజన్‌లో PhonePeలో బంగారం & వెండిని పర్ఫెక్ట్ ఆప్షన్ చేస్తాయి. బంగారు నాణేలను కొనుగోలు చేసే కస్టమర్లు ప్రతి కొనుగోలుపై స్వచ్ఛతకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని కూడా సంస్థ అందిస్తోంది. వినియోగదారులు రోజులో ఏ సమయంలోనైనా వీటిని కొనుగోలు చేయవచ్చు. అత్యల్పంగా ఒక్క రూపాయి నుంచి బంగారం, వెండిని కొనుగోలు చేయవచ్చు. వీటిని కంపెనీ ఇన్షూరెన్స్ చేయబడిన డోర్‌స్టెప్ డెలివరీ కూాడా అందిస్తోంది. ఫ్యూచర్ అవసరాల కోసం వీటిని కొంటున్నట్లయితే.. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఇన్సూరెన్స్ చేసిన బ్యాంక్ గ్రేడ్ లాకర్లలో కంపెనీ వీటిని కస్టమర్ల తరఫున ఉచితంగా స్టోర్ చేస్తుంది. వీటిని దేశంలోని 19 వేలకు పైగా పిన్ కోడ్ లలో డెలివరీ తీసుకునేందుకు వెసులుబాటు కూడా ఉంది.

వీటిని కొనుగోలు చేసేందుకు ముందుగా కస్టమర్లు హోమ్ పేజ్ హెల్త్ ట్యాబ్ క్లిక్ చేయాలి. అందులోని ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాస్ విభాగంలో గోల్ట్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు అవసరమైన బంగారం లేదా వెండిని ఎంపిక చేసుకోవచ్చు. ఆ తరువాత డెలివరీ అడ్రస్ ఎంటర్ చేసి, వివరాలు చెక్ చేసుకుని ప్రొసీడ్ ఆప్షన్ ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయండి. ఇలా సింపుల్ గా బంగారం, వెండిని వినియోగదారులు డిజిటల్ గా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు తర్వాత మీ PhonePe వాలెట్‌లో క్యాష్‌బ్యాక్ మెుత్తాన్ని పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Elon Musk: ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనకు ఒక వ్యాధి కారణమని తెలుసా.. ఇంతకీ దాని లక్షణాలేంటంటే..

Going Concern: గోయింగ్ కన్సర్న్ అంటే ఏమిటో తెలుసా? దీనివల్ల ఇన్వెస్టర్లు ఏమి గ్రహించవచ్చు..