Vijaya Gadde: తెలుగు మహిళను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎందుకిలా చేస్తున్నాడంటే..
Vijaya Gadde: మైక్రో బ్లాగర్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మరుసటి రోజే ఎలాన్ మస్క్ సంస్థ పనితీరుపై దృష్టి సారించటం మెుదలు పెట్టారు. అందులో ముఖ్యంగా కంపెనీ లీగల్ చీఫ్ అయిన తెలుగు మహిళను టార్గెట్ చేశారు.
Vijaya Gadde: మైక్రో బ్లాగర్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మరుసటి రోజే ఎలాన్ మస్క్ సంస్థ పనితీరుపై దృష్టి సారించటం మెుదలు పెట్టారు. అందులో ముఖ్యంగా కంపెనీ లీగల్ చీఫ్ అయిన తెలుగు మహిళను టార్గెట్ చేశారు. ట్విట్టర్ విధాన నిర్ణయాల్లో తెలుగు మహిళ విజయ గద్దె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫేక్ న్యూస్ ప్రచారాలను ట్విట్టర్ లో అరికట్టడంతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బ్లాక్ చేయటంలో ఆమెది కీలక పాత్రని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ విషయంపై సీఈవో పరాగ్ అగర్వాల్ సైతం తీవ్రంగా స్పందించారు. మస్క్ ట్వీట్లను ‘రొద’గా ఆయన అభివర్ణించారు.
అసలు ఇంతకీ ఈ విజయ గద్దె ఎవరు. ఆమెను ఎలాన్ మస్క్ టార్గెట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ట్విట్టర్ కంపెనీకి లీగల్ పాలసీ హెడ్ గా విధులు నిర్వహిస్తున్న విజయ తెలుగునాట జన్మించారు. ఒక విధంగా చెప్పాలంటే ట్విట్టర్ కంపెనీలో సీఈవో పదవి కంటే లీగల్ హెడ్ పదవికే ఎక్కువ శక్తివంతమైనది. 48 ఏళ్ల విజయ ఒక టాప్ లాయర్. అనేక మార్లు ఆమె తీసుకున్న కఠిన నిర్ణయాలు అమెరికాలో చాలా మందిని ఇబ్బందికరంగా మారాయి. ట్విట్టర్ యూజర్లు వాడే పదాలు అభ్యంతరకరంగా లేకుండా చేయడంలో విజయ చేసిన ప్రయత్నం విజయవంతమైందని చెప్పుకోవాలి. కంపెనీ మస్క్ చేతికి వెళితే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందని దానిపై బోర్డు మీటింగ్ లో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ట్వీట్లు చేసినప్పుడు.. వాటికి అడ్డుకట్ట వేసే క్రమంలో ఆయన ట్విట్టర్ ఖాతానే సస్పెండ్ చేయటంలో విజయ ప్రధాన పాత్ర పోషించారు. ఆమె సలహాతోనే ట్విట్టర్‌లో రాజకీయ ప్రకటనలను నిషేధిస్తూ 2019లో ఆ కంపెనీ సీఈవోగా ఉన్న జాక్ డార్సీ నిర్ణయం తీసుకున్నారు. 2018లో జాక్ డార్సీ బృందంలో సభ్యురాలిగా దిల్లీ వచ్చిన ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు.
విజయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. మూడేళ్ల వయసులో ఆమె కుంటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే టెక్సాస్ రాష్ట్రంలో విజయ కుటుంబం స్థిరపడింది. అమెరికా వెళ్లిన తొలినాళ్లలో విజయ తండ్రి జాత్యాంహకారాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన అనుభవాలను తెలుసుకున్న విజయ ‘లా’ చదివారు. ఆమె లాయర్ అయిన రామ్సే హామ్సనీ అనే అమెరికన్ ను వివాహం చేసుకున్నారు.
Vijaya Gadde, the top censorship advocate at Twitter who famously gaslit the world on Joe Rogan’s podcast and censored the Hunter Biden laptop story, is very upset about the @elonmusk takeover pic.twitter.com/WCYmzNEMNt
— Saagar Enjeti (@esaagar) April 26, 2022
ఇవీ చదవండి..
PhonePe: బంగారం ప్రియులకు మెగా క్యాష్ బ్యాక్.. అక్షయ తృతీయకు ఫోన్ పే భారీ డిస్కౌంట్..
Elon Musk: ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనకు ఒక వ్యాధి కారణమని తెలుసా.. ఇంతకీ దాని లక్షణాలేంటంటే..