Elon Musk: ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనకు ఒక వ్యాధి కారణమని తెలుసా.. ఇంతకీ దాని లక్షణాలేంటంటే..
Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆస్థి విలువ 250 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయనకు కూడా ఒక ఆరోగ్య సమస్య ఉందటని మీకు తెలుసా.
Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆస్థి విలువ 250 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయనకు కూడా ఒక ఆరోగ్య సమస్య ఉందటని మీకు తెలుసా. అదే ఆస్పెర్గర్స్ సిండ్రోమ్ అనబడే ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. ఇది ఉన్న వ్యక్తులు సంచలన వ్యాఖ్యలు, సంచలన నిర్ణయాలు తీసుకుంటారట. ఇటీవల ట్విట్టర్ కొనుగోలుతో వార్తల్లో నిలిచిన మస్క్.. వాక్ స్వాతంత్య్రం కోసం దానిని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించటం విషేషం. మస్క్ ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.. ఆయన రిస్క్ చేయటంలో ముందుంటారు. మెున్నటికి మెున్న ఉక్రెయిన్ – రష్యా యుద్ధం పై స్పందించినప్పుడు.. ‘పుతిన్ నాతో యుద్ధం చెయ్’ అని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘సాటర్డే నైట్ లైవ్’ అనే అమెరికన్ కార్యక్రమానికి హోస్ట్ గా పనిచేసిన మస్క్.. ఆ సమయంలో తన ఆరోగ్య సమస్య గురించి వెల్లడించారు. ఇది ఒక న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్. మెదడులో సమస్య వల్ల లేదా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మస్క్ మరో సంచనానికి శ్రీకారం చుట్టారు. ఈ సారి ఏకంగా బివరేజెస్ దిగ్గజం కోకాకోలాను కొనేస్తానని.. కోక్ లో కొకెయిన్ కలిపి తిరిగి అమ్ముతానని సంచలన ట్వీట్ చేశారు.
ఈ వ్యాధి ఉన్నవారు సామాజికంగా, కమ్యూనికేషన్ పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటారు. నాన్ వెర్బల్ సంభాషణలను వీరు త్వరగా అర్థం చేసుకోలేరు. కొన్ని విషయాల్లో చాలా దూకుడుగా ఉంటారు. ఆకస్మికంగా నిర్ణయాలను మార్చేసుకుంటుంటారు. వారి సోషల్ స్కిల్స్ చాలా పరిమితంగా ఉంటాయి. అధిక శబ్ధాలను లేదా అధిక వెలుతురును భరించలేరు. ప్రసంగించేటప్పుడు చాలా బిగ్గరగా చెబుతారు, లేదా ఒక్కోసారి చాలా నిశ్శబ్ధంగా ఉండిపోతారు. ఇతర వ్యక్తుల వైపునుంచి ఆలోచించలేరు. వ్యక్తీకరించడంలో ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పటం, చేసిన పనే మళ్లీ చేయటం లాంటివి చేస్తుంటారు. దీనికి ఎటువంటి చికిత్స లేదు. కానీ.. లక్షణాలను కంట్రోల్ లో పెట్టుకునే థెరపీలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఎలాన్ మస్క్ కూడా థెరపీలతోనే తన సమస్యను అదుపులో ఉంచుకోగలిగారట.
మస్క్ కు మెుత్తం ఏడుగురు సంతానం. మెుదటి భార్య వల్ల ఐదుగురు కుమారులు, రెండవ భార్య ద్వారా ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. తన కూతురికి విచిత్రంగా ‘ఎక్సా డార్క్ సైడెరెల్’ (Exa Dark Sidereel) అంటూ నోరుతిరగని పేరొకటి పెట్టారు. ఎలాన్ మస్క్ చెబుతున్న ఫ్రీ స్పీచ్ గురించి టెస్లా కంపెనీ ఉద్యోగుల అభిప్రాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. ఉద్యోగుల భావ ప్రకటన స్వేచ్ఛ లేదా విమర్శలను ఉపేక్షించబోడని ఆ ఉద్యోగులు అంటున్నారు. దీనికి సంబంధించి టెస్లా కంపెనీలో ఓ అగ్రిమెంట్ ఉంటుందని, దానికి కాల పరిమితి కూడా లేదని ఉద్యోగులు చెబుతున్నారు. కంపెనీ గురించి దాని సేవల గురించి ఉద్యోగులు ఏ విధంగానైనా నెగెటివ్‌గా మాట్లాడరాదని, చెప్పరాదని, అభిప్రాయాలు వెలిబుచ్చరాదని ఆ ఒప్పందం చెబుతోంది. ఓ టెస్టా మాజీ ఎంప్లాయీ ఈ ఒప్పందంపై సంతకం పెట్టడానికి నిరాకరించాడు. దీంతో ఆయనను కంపెనీ నుంచి తొలగించారు. ఆయన ఆ ఒప్పందం కాపీని సీఎన్‌బీసీ ఛానెల్‌తో పంచుకున్నాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Going Concern: గోయింగ్ కన్సర్న్ అంటే ఏమిటో తెలుసా? దీనివల్ల ఇన్వెస్టర్లు ఏమి గ్రహించవచ్చు..
Contra Funds: మీకు కాంట్రా ఫండ్స్ అంటే తెలుసా? వాటిలో పెట్టుబడి లాభమేనా..