Viral News: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Viral News: తన ఆరేళ్ల కొడుకుతో ఓ తండ్రి అగ్రీమెంట్ చేసుకున్నాడు. తాను చెప్పినట్లు వింటే 100 రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందానికి సంబంధించిన పేపర్ ఇప్పుడు..

Viral News: ఆరేళ్ల కొడుకుతో తండ్రి అగ్రీమెంట్.. షాక్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Agreement
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 28, 2022 | 6:07 PM

Viral News: తన ఆరేళ్ల కొడుకుతో ఓ తండ్రి అగ్రీమెంట్ చేసుకున్నాడు. తాను చెప్పినట్లు వింటే 100 రూపాయలు ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందానికి సంబంధించిన పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ అగ్రీమెంట్ పేపర్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఇంతకీ ఆ తండ్రీకొడుకుల మధ్య ఏం ఒప్పందం జరిగిందో ఓసారి చూద్దాం పదండి..

ఆరేళ్ల పిల్లాడు అంటే సాధారణంగానే ఇల్లుపీకి పందిరేస్తారు. ఒక మాట చెబితే.. మరో పని చేస్తారు. అరుపులు, ఏడుపులు మొత్తానికి రచ్చ రచ్చ చేస్తాని చెప్పొచ్చు. అయితే, ఓ వ్యక్తి తన కొడుకు అల్లరిని కంట్రోల్ చేయడానికి, అతన్ని దారిలోకి తీసుకురావడానికి సరికొత్త ప్లాన్ వేశాడు. అదే అగ్రీమెంట్ ప్లాన్. ‘రోజూవారీ షెడ్యూల్, పనులు, ప్రవర్తన మార్చుకోవడం, చదువుకోవడం’ అంశాలను షెడ్యూల్ చేస్తూ ఒక ఒప్పందాన్ని కొడుకుతో చేసుకున్నాడు తండ్రి. అయితే, ప్రతీ అంశానికి ఒక ఆఫర్ కూడా ప్రకటించాడు. ఒక వారం మొత్తం ఏడవకకుండా, కేకలు వేయకుండా, పోట్లాడకుండా ఉంటే రూ.100 ఇస్తానని మాట ఇచ్చాడు. ఇంతేకాదు.. ఆ ఒప్పందంలో మరికొన్ని ఆసక్తికర అంశాలు కూడా ఉన్నాయి.

ఉదయం లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే ప్రతి పాయింట్‌ను పేర్కొంటూ ఒంప్పందం చేసుకున్నారు. వీటిని తూచాతప్పకుండా పాటిస్తే రూ.100 ఇచ్చేలా అగ్రీమెంట్ చేసుకున్నారు. ఒప్పందం ఇలా ఉంది. ‘‘ఉదయం 7:50 అలారం మోగితే 8:00 కి నిద్ర లేవాలి(10 నిమిషాలు అలారం వెసులుబాటు). 8.20 లోపు బ్రష్ చేయడం, స్నానం చేయడం పూర్తి చేయాలి. 8.50 లోపు బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేయాలి. 9.00 నుంచి 2.00 వరకు స్కూల్. 2.00 నుంచి 2.30 వరకు టీవీ+ఫ్రూట్స్ తినాలి. 2.30 నుంచి 4.00 ఆటల సమయం. 4.00 నుంచి 4.30 మిల్క్ టైమ్. 4.30 నుంచి 6.00 వరకు ఆటలు(టెన్నీస్, వాలీబాల్). 6.00 నుంచి 8.00 వరకు హోమ్ వర్క్. 8.00 నుంచి 9.00 వరకు డిన్నర్ టైమ్. 9.00 నుంచి 9.30 వరకు హోమ్ క్లీనింగ్ టైమ్. 9.30 నుంచి 10.00 వరకు రిలాక్స్. 10.00 నుంచి ఉదయం 8.00 గంటల వరకు స్లీప్ టైమ్.’’ ఇదీ టైంస్లాట్. మరో ఆఫర్ కూడా ఉంది. ఒక రోజులో ఏడవకుండా, అరవకుండా, గుసగుసలాడకుండా ఉంటే ఆ రోజు రూ.10 గిఫ్ట్‌గా ఇస్తారు. ఒక వారం మొత్తం ఏడవకుండా, పోట్లాడకుండా, కేకలు వేయకుండా ఉంటే రూ.100 ఇస్తానని పేర్కొన్నాడు ఆ తండ్రి.

కాగా, తన కొడుకుతో చేసుకున్న అగ్రీమెంట్ పేపర్ కాపీని అతను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ అగ్రిమెంట్‌పై నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి, మరిన్ని టీవీ9 తెలుగు వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Also read:

Janasena: మాటలే కానీ చేతలు ఎక్కడ.. మహిళలకు రక్షణ లేదంటూ.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడిన జనసేన

CM KCR Review: నల్గొండ టౌన్, సాగర్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ఫోన్‌లో మంత్రి, అధికారులకు ఆదేశాలు!

AP SSC Hindi Paper Leak 2022: ఇది లీక్ కాదు.. పరీక్ష ప్రారంభమైన గంటకి వాట్సప్‌లో సర్కులేట్‌ అయ్యింది: డీఈఓ