Janasena: మాటలే కానీ చేతలు ఎక్కడ.. మహిళలకు రక్షణ లేదంటూ.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడిన జనసేన

Janasena: ఏపీలో(Andhrapradesh) ఎన్నికల వాతావరణాన్ని ముందే తీసుకొచ్చాయి రాజకీయ పార్టీలు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా..

Janasena: మాటలే కానీ చేతలు ఎక్కడ.. మహిళలకు రక్షణ లేదంటూ.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడిన జనసేన
Janasena Nadendla Manohar
Follow us
Surya Kala

|

Updated on: Apr 28, 2022 | 4:54 PM

Janasena: ఏపీలో(Andhrapradesh) ఎన్నికల వాతావరణాన్ని ముందే తీసుకొచ్చాయి రాజకీయ పార్టీలు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంది. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్నచందంగా వైసీపీ (YCP) నేతలు, జనసేన నేతల మధ్య మాటల వార్ కొనసాగుతుంది. తాజాగా ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. దిశ చట్టం చేశాం… గన్ కంటే జగన్ ముందు వస్తాడు… లాంటి మాటలు చెప్పడం తప్ప వైసీపీ పాలకులు యువతులకు, మహిళలకు ఇసుమంతైనా రక్షణ ఇస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో మాటలు తప్ప చేతలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో అఘాయిత్యాలు చోటు చేసుకొంటున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు ఉదాహరణగా రాష్ట్రంలో జరిగిన పలు అత్యాచారాల ఘటనలను పేర్కొన్నారు నాదెండ్ల.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి హత్య చేసిన ఘటన బాధాకరం. కొల్లూరు మండలం చిలమూరులోనూ పట్టపగలే ఓ మహిళ హత్యకు గురవ్వడం దురదృష్టకరం. విజయవాడలో మానసిక పరిపక్వత లేని యువతిపై సర్వజనాసుపత్రిలో చోటు చేసుకున్న ఘటన, తిరువూరులో ఇంటర్ విద్యార్థినిపై వాలంటీర్ భర్త వేధింపులాంటివి మరువక ముందే గుంటూరు జిల్లాలో అత్యాచారాలు, హత్యలు జరిగాయన్నారు.

రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నా సిబిఐ దత్తపుత్రుడిలో చలనం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల రక్షణ విషయంలో పాలకులకు చిత్తశుద్ధి లోపించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది.. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టేవారికి భయం అనేది లేకుండాపోయింది. చట్టాలు చేశాం, యాప్ తెచ్చాం అని ప్రకటనలు మాత్రమే చేసే చేతగాని ప్రభుత్వం వల్ల ఆడబిడ్డలకు ధైర్యం కలగడం లేదంటూ వాపోయారు.

ముఖ్యమంత్రి జగన్ ఇంటిలో సమీపంలో కృష్ణా నది ఒడ్డున గతేడాది జులైలో సామూహిక అత్యాచారం చోటు చేసుకొంటే ఇప్పటికీ ఓ నిందితుణ్ణి పట్టుకోలేదు. గుంటూరు జిల్లా మేడికొండూరులోనూ సామూహిక అత్యాచారం జరిగితే పోలీసుల స్పందన, నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం చూస్తుంటే.. ఈ పాలకులు ఎలా గాడి తప్పించారో అర్థం అవుతోందన్నారు నాదెండ్ల.

వైసీపీ ప్రభుత్వం పోలీసు శాఖను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతిభద్రతలు గాలికొదిలేసిందని ఆరోపించారు. వైసీపీ ఫ్లెక్సీలు చిరిగితే స్కూలు పిల్లలను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టే స్థితికి ఆ శాఖను దిగజార్చిందంటూ వాపోయారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఆడబిడ్డలకు రక్షణ కల్పించి… అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేసినప్పుడు ఆ అవార్డులకు విలువ ఉంటుందని నాదెండ్ల మనోహన్ ఘాటుగా ఏపీ ప్రభుత్వ తీరుని నిరసించారు.

Also Read:Astro Tips: డబ్బు ఇబ్బందులు పడుతున్న గురు బలం లేనివారు.. గురువారం పాటించాల్సిన నివారణ చర్యలు ఏమిటంటే..

Kishan Reddy on TRS: మంత్రిగా ఉండి కేబినెట్‌కు వెళ్లలేని వాళ్లు.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారుః కిషన్ రెడ్డి