మామిడి పండ్లు తింటే నిజంగా లావు అవుతారా.. అసలు నిజాలు తెలుసుకోండి

Krishna

17 may 2026

చాలా మంది మామిడి పండ్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుందని భ్రమపడతారు. కానీ నిజానికి మామిడి పండ్లలో కొలెస్ట్రాల్ గానీ హానికరమైన కొవ్వులు గానీ అస్సలు ఉండవు. ఇది పూర్తిగా సహజమైన, ఆరోగ్యకరమైన పండు.

కొలెస్ట్రాల్ జీరో

ఒక మీడియం సైజ్ మామిడి పండులో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. బరువు పెరగడానికి మామిడి పండు కారణం కాదు.. మనం రోజూ తినే నార్మల్ భోజనంతో పాటు అదనంగా ఈ కేలరీలను కూడా బాడీకి అందించడం వల్లే బరువు పెరుగుతారు.

అసలైన విలన్ కేలరీలే

మీరు లావు అవ్వకూడదు అనుకుంటే.. లంచ్ లేదా డిన్నర్ చేస్తున్నప్పుడు మామిడి పండును నంజుకుంటూ తినడం మానేయాలి. దానికి బదులుగా ఉదయం లేదా సాయంత్రం టైమ్‌లో ఓ లైట్ స్నాక్‌లా తింటే బరువు పెరిగే ఛాన్స్ ఉండదు.

భోజనంతో పాటు వద్దు

మామిడి పండును రసం లేదా మిల్క్‌షేక్ రూపంలో తీసుకుంటే.. అందులోని ఫైబర్ పూర్తిగా నశించిపోతుంది. పైగా జ్యూస్‌లలో అదనంగా చక్కెర, పాలు కలపడం వల్ల కేలరీలు రెట్టింపై బరువు చాలా వేగంగా పెరుగుతారు.

జ్యూస్‌లు, మిల్క్‌షేక్‌లకు నో

మామిడి పండును ఎప్పుడైనా సరే ముక్కలుగా కోసుకుని, బాగా నమిలి తినాలి. ఇలా తినడం వల్ల అందులోని ఫైబర్ శరీరానికి అంది, జీర్ణక్రియ బాగుంటుంది. పైగా కడుపు నిండిన భావన కలిగి ఎక్కువ ఆహారం తినకుండా నిరోధిస్తుంది.

ముక్కలే ముద్దు

బరువు తగ్గాలి అనుకునే వారు రాత్రి పడుకునే ముందు మామిడి పండ్లు తినకపోవడం మంచిది. రాత్రి పూట తింటే అందులోని షుగర్స్ సరిగ్గా బర్న్ అవ్వక శరీరంలో ఫ్యాట్‌గా మారే ప్రమాదం ఉంది.

రాత్రిపూట నో ఎంట్రీ

లిమిట్‌గా తింటే మామిడి పండు కంటే గొప్ప హెల్తీ ఫుడ్ లేదు. రోజుకు ఒక మామిడి పండు తినడం వల్ల బరువు పెరగకపోవడంతో పాటు  మీ రోగనిరోధక శక్తిని, చర్మ సౌందర్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తాయి.

రోజుకు ఒకటి అమృతం

మామిడి పండ్లలో గ్లైసిమిక్ ఇండెక్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవి తిన్న వెంటనే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే షుగర్ వ్యాధి ఉన్నవారు డాక్లర్ల సలహా మేరకు తీసుకోవాలి.

డయాబెటిస్