Alcohol Prices: పక్క రాష్ట్రం కీలక నిర్ణయం.. మారిన లిక్కర్ ధరలు.. చౌక మద్యం ఇక కాస్ట్లీ.. ప్రీమియం బ్రాండ్లు మాత్రం తగ్గింపు..!
Alcohol Prices: పక్క రాష్ట్ర ప్రభుత్వం తన ఎక్సైజ్ విధానంలో (Excise Policy) చారిత్రాత్మక మార్పులు చేసింది. భారతదేశంలోనే మొదటిసారిగా "ఆల్కహాల్-ఇన్-బెవరేజ్" (Alcohol-in-Beverage - AIB) పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న బల్క్ లీటర్ లేదా బ్రాండ్ ఆధారిత పన్ను విధానానికి స్వస్తి పలికింది.

Alcohol Prices: గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న బల్క్ లీటర్ లేదా బ్రాండ్ ఆధారిత పన్ను విధానానికి కర్ణాటక స్వస్తి పలికింది. ఇకపై పానీయంలో ఉండే ఆల్కహాల్ శాతాన్ని (Alcohol Percentage) బట్టి మాత్రమే పన్ను విధిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం పాత 16 ఎక్సైజ్ ట్యాక్స్ స్లాబ్‌లను 8 స్లాబ్‌లకు తగ్గించింది. ఈ కొత్త విధానం వల్ల సాధారణ/బడ్జెట్ మద్యం ధరలు పెరిగాయి. కానీ ప్రీమియం/ఇంపోర్టెడ్ (విదేశీ) మద్యం ధరలు తగ్గాయి.
సాధారణ బ్రాండ్స్
సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే సాధారణ విస్కీ, రమ్, బ్రాందీ, వోడ్కా (ముఖ్యంగా 180 మి.లీ క్వార్టర్ బాటిళ్లు, టెట్రా ప్యాక్‌లు). వంటివి పెంచింది. మొదటి 5 స్లాబ్‌లపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (AED) పెంచడం వల్ల వీటి ధరలు 20% నుండి 30% వరకు పెరిగాయి. ఉదాహరణకు గతంలో రూ.80 కి లభించే ఒక సాధారణ క్వార్టర్ బాటిల్ ధర ఇప్పుడు దాదాపు రూ.105 కి చేరింది.
ప్రీమియం, విదేశీ బ్రాండ్లు
లగ్జరీ బ్రాండ్లు (ఉదాహరణకు: బ్లాక్ లేబుల్, చివాస్ రీగల్, డయాజియో, పెర్నోడ్ రికార్డ్), కొన్ని మైల్డ్/లాగర్ బీర్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. 6 నుండి 8వ స్లాబ్‌ల వరకు ఉన్న మద్యంపై సుంకాన్ని 10% నుండి 15% తగ్గించడం వల్ల ఈ ప్రీమియం బ్రాండ్ల ధరలు 16% నుండి 25% వరకు తగ్గాయి. ఒకప్పుడు రూ.5,190 ఉన్న 750 మి.లీ బ్లాక్ లేబుల్ లేదా చివాస్ రీగల్ బాటిల్ ధర ఏకంగా రూ.4,100 కి తగ్గింది. కొన్ని రకాల మైల్డ్ బీర్ల ధరలు కూడా బ్రాండ్‌ను బట్టి రూ.20 నుండి ₹75 వరకు తగ్గాయి.
ఈ మార్పుకు కారణాలు ఏంటి?
ధరల నియంత్రణ సడలింపు: ప్రభుత్వం గతంలో ధరలను నిర్ణయించే విధానాన్ని పూర్తిగా సడలించింది. దీనివల్ల తయారీదారులు మార్కెట్ పరిస్థితులను బట్టి తమ ఉత్పత్తులను తగిన స్లాబ్‌లలో ఉంచుకునే వీలు కలుగుతుంది. గోవా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల మద్యం ధరలతో కర్ణాటక ధరలను సమం చేయడం ద్వారా సరిహద్దుల గుండా జరిగే అక్రమ మద్యం రవాణాను (స్మగ్లింగ్) అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం.
స్థానిక తయారీదారుల ఆందోళన
కర్ణాటక బ్రూవర్స్ అండ్ డిస్టిల్లర్స్ అసోసియేషన్ (KBDA) ఈ నిర్ణయంపై కొంత ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రానికి వచ్చే మొత్తం ఎక్సైజ్ ఆదాయంలో 70% నుండి 75% వరకు మొదటి ఐదు స్లాబ్‌ల (సాధారణ మద్యం) నుంచే వస్తుంది. అందుకే ఈ కొత్త పాలసీ భారం ఎక్కువగా పేద, మధ్యతరగతి వినియోగదారులపైనే పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




