AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్ పేషెంట్లకి కొబ్బరి నీళ్లు మంచివేనా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా..!

Diabetes: సాధారణంగా షుగర్ పేషెంట్లు తీపి పదార్థాలకు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. తద్వారారక్తంలో చక్కెర స్థాయి

Diabetes: షుగర్ పేషెంట్లకి కొబ్బరి నీళ్లు మంచివేనా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా..!
Coconut Water
uppula Raju
|

Updated on: Feb 25, 2022 | 12:18 PM

Share

Diabetes: సాధారణంగా షుగర్ పేషెంట్లు తీపి పదార్థాలకు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తారు. తద్వారారక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఈ కారణంగా చాలామంది షుగర్‌ పేషెంట్లు తియ్యని పండ్లను తినడం మానేస్తారు. అయితే లేత కొబ్బరి నీటికి సంబంధించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. పచ్చి కొబ్బరి నీళ్లు జీరో కేలరీలను కలిగి ఉండే సహజసిద్దమైన పానీయం. దీంతో పాటు ఎలక్ట్రోలైట్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి, ఫోలేట్ వంటి అనేక ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో తీపి రుచి ఉండవచ్చు కానీ ఇందులో సహజ చక్కెర ఉంటుంది. కృత్రిమ స్వీటెనర్ ఉండదు. కాబట్టి ఇది మీ శరీరంలోని చక్కెర స్థాయిని ప్రభావితం చేయదు. అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ ఇప్పటికి షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లని తాగాలా వద్దా అని ఆలోచిస్తారు.

షుగర్‌ వ్యాధిపై కొబ్బరి నీళ్ల ప్రభావం గురించి మానవులపై ప్రత్యేక పరిశోధనలు ఏమి జరగలేదు. కానీ కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి మొదలైనవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కూడా కొబ్బరి నీరు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని నివేదించింది. కానీ ఇది సహజంగా తీపి, ఫ్రక్టోజ్‌ను కలిగి ఉందని గుర్తుంచుకోవాలని చెప్పింది. కాబట్టి కొబ్బరి నీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ పేషెంట్లు రోజూ 1 కప్పు (240 మి.లీ) కొబ్బరి నీళ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు.

కొబ్బరి నీళ్ల వల్ల అనేక ఇతర ప్రయోజనాలు

కొబ్బరి నీళ్ల ద్వారా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కిడ్నీ స్టోన్ వ్యాధిని నివారిస్తుంది. శరీరంలోని నీటి పరిమాణాన్ని నిర్వహించడానికి కొబ్బరి నీరు మంచి ఔషధమని చెప్పవచ్చు. కొబ్బరి నీరు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం నుంచి రక్షిస్తుంది. కొబ్బరి నీళ్లలో తగినంత పొటాషియం ఉన్నందున ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

త్వరగా బరువు తగ్గడానికి ఈ నూనె ఒక్కటి చాలు.. వ్యాయామం అవసరమే ఉండదు..!

Vastu Tips: చేతిలో డబ్బులు నిలవడం లేదా.. ఇంట్లో ఈ వస్తువులు ఉంచండి..!

Zodiac Signs: ఫిబ్రవరి 27 నుంచి ఈ 3 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే..?