Heart Attack: గుండెపోటు గురించి 3 సంవత్సరాల ముందుగానే తెలుసకోవచ్చు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
Heart Attack: భారతదేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్నవారు చాలామంది ఉన్నారు. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా
Heart Attack: భారతదేశంలో గుండె జబ్బులతో బాధపడుతున్నవారు చాలామంది ఉన్నారు. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల యువత గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రమాదాన్ని మూడు సంవత్సరాల ముందుగానే గుర్తించవచ్చు. శాస్త్రవేత్తలు ఆ పద్దతిని కనుగొన్నారు. ఇది చాలా మంచి పరీక్ష. దీనివల్ల గుండె జబ్బుల వల్ల కలిగే మరణాల సంఖ్యని తగ్గించవచ్చు. దీర్ఘకాలిక గుండెపోటు రోగుల సి-రియాక్టివ్ ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇందులో వారు వాపుని గుర్తించారు. దీంతోపాటు ట్రోపోనిన్ ప్రామాణిక పరీక్ష కూడా నిర్వహించారు. ట్రోపోనిన్ అనేది గుండె దెబ్బతిన్నప్పుడు రక్తం నుంచి విడుదలయ్యే ఒక రకమైన ప్రత్యేక ప్రోటీన్. అధ్యయనం ప్రకారం.. ఈ ట్రోపోనాన్ పరీక్షలో పాజిటివ్ అని తేలితే మరణ ప్రమాదం 3 సంవత్సరాలలో 35 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు.
శాస్త్రవేత్తల ప్రకారం సరైన సమయంలో చికిత్స, పర్యవేక్షణ, మందులు వాడితే లక్షలాది మందిని మరణం నుంచి రక్షించవచ్చు. అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గుండెపోటుకు సంబంధించిన అనేక లక్షణాలను గుర్తించింది. ఇందులో ఛాతీ నొప్పి, అసౌకర్యం చాలా ముఖ్యమైనవి. బలహీనత, గొంతు, నడుము లేదా దవడలో నొప్పి కూడా ఉంటుంది. మీకు భుజంలో అసౌకర్యం లేదా నొప్పి ఉంటే కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే లేదా అకస్మాత్తుగా మైకం వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఛాతీ నొప్పితో శ్వాస ఆడకపోవడాన్ని కలిగి ఉండవచ్చు. ఇది నిశ్శబ్ద గుండెపోటుకు సాధారణ సంకేతం. ఒక్కోసారి మీరు మైకంతో మూర్ఛపోవచ్చు.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.