Kharjura Benefits: వారికి వరం ఖర్జురా పండ్లు.. రోజూ 5 – 6 తింటే ప్రాణాంతక వ్యాధుల సైతం మటుమాయమే..

సహజ తీపి పదార్థం అయిన ఖర్జూర పండ్లంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మనదేశంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఖర్జూరాలను తింటారు.

Kharjura Benefits: వారికి వరం ఖర్జురా పండ్లు.. రోజూ 5 - 6 తింటే ప్రాణాంతక వ్యాధుల సైతం మటుమాయమే..
Dates
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 16, 2022 | 8:44 PM

సహజ తీపి పదార్థం అయిన ఖర్జూర పండ్లంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మనదేశంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఖర్జూరాలను తింటారు. వీటిని షేక్స్, స్వీట్లు, అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఖర్జూరం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనితో పాటు గర్భిణీ స్త్రీలపై ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుందని ఒక అధ్యయనంలో సైతం తేలింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరం తినడం వల్ల లేబర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. అందుకే ప్రతిరోజూ ఉదయం లేదా.. రాత్రి సమయాల్లో ఖర్జురా పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రి నానబెట్టి ఉదయం ఎండు ఖర్జూరాలను తిన్నా అనేక పోషకాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ.. మూడు నుంచి ఐదారు ఖర్జురాలు తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.

ఖర్జూరం తింటే.. కలిగే ప్రయోజనాలు ఇవే..

  1. ఖర్జూరంలో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాలు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఖనిజాలు, విటమిన్ల నిధి. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. రేగు, అత్తి పండ్ల కంటే ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది.
  2. ఖర్జూరం మధుమేహం, అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ కళ్లు, గుండెకు మేలు చేస్తాయి.
  3. ఇవి కూడా చదవండి
  4. విటమిన్లు B1, B2, B3, B5, A1తో పాటు అనేక రకాల అమైనో ఆమ్లాలు కూడా ఖర్జూరంలో ఉంటాయి. గర్భిణీలు ప్రసవానికి ఒక నెల ముందు ఖర్జూరం తినడం ప్రారంభిస్తే ఆమె సాధారణ ప్రసవానికి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గర్భధారణ సమయంలో ఖర్జూరం తినడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.
  5. ప్రతిరోజూ ఖర్జురాలు తినడం వల్ల చర్మం, మెదడు, ఎముకలు, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలోని కొవ్వును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా