AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (February 10, 2026): మేష రాశివారికి వ్యాపార లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి, ఆశించిన కోరికలు నెరవేరుతాయి. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఇతరులకు సహాయం చేసే అవకాశాలు కలుగుతాయి. మేషం నుంచి మీనం వరకు అన్ని 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

Horoscope Today: వారి ఆదాయం బాగా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 10 Feb 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 10, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 10, 2026): మేష రాశి వారికి వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. వృషభ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ధనపరంగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా గడుస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా ఆశించిన ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వ్యయ ప్రయాసలతోగానీ పనులు, వ్యవహారాలు పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా బాగా మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదనపు ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం సమసిపోతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారికి శుభ వార్త అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి కాస్తంత ఒత్తిడి ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పుల్ని చేపడతారు. ఆదాయానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు.. కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినా ప్రతిఫలం ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాల్ని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన విధంగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా, ఆదాయపరంగా కూడా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో మీ నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగు తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. ఇతరుల బాధ్యతల్ని నెత్తిన వేసుకుని ఇబ్బంది పడ తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. రావలసిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మొండి బాకీల్ని వసూలు చేసుకుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచుతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి అధికారుల ఆదరణ పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యాలకు లేదా విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.