AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microwave Oven: మైక్రోవేవ్ ఓవెన్‌లో ఫుడ్ వేడి చేస్తున్నారా? ఏ ఏ ఫుడ్స్ పెట్టకూడదో తెలుసా?

మైక్రోవేవ్ ఓవెన్ ఇప్పుడు ప్రతి ఇంటా ఉండే అనివార్య గాడ్జెట్ అయిపోయింది. 2-౩ నిమిషాల్లో ఆహారం వేడెక్కించేయడం, రీహీట్ చేయడం చాలా సులువు. కానీ అన్నీ ఆహార పదార్థాలూ మైక్రోవేవ్‌ ఫ్రెండ్లీ కావు. కొన్ని ఆహారాలు వేడి చేస్తే పోషకాలు నాశనం అవుతాయి, కొన్ని ..

Microwave Oven: మైక్రోవేవ్ ఓవెన్‌లో ఫుడ్ వేడి చేస్తున్నారా? ఏ ఏ ఫుడ్స్ పెట్టకూడదో తెలుసా?
Microwave Oven
Nikhil
|

Updated on: Dec 04, 2025 | 11:40 AM

Share

మైక్రోవేవ్ ఓవెన్ ఇప్పుడు ప్రతి ఇంటా ఉండే అనివార్య గాడ్జెట్ అయిపోయింది. 2-౩ నిమిషాల్లో ఆహారం వేడెక్కించేయడం, రీహీట్ చేయడం చాలా సులువు. కానీ అన్నీ ఆహార పదార్థాలూ మైక్రోవేవ్‌ ఫ్రెండ్లీ కావు. కొన్ని ఆహారాలు వేడి చేస్తే పోషకాలు నాశనం అవుతాయి, కొన్ని విషపూరితం అవుతాయి, మరికొన్ని పేలి మైక్రోవేవ్‌నే డ్యామేజ్ చేస్తాయి. మైక్రోవేవ్ ఓవెన్ టైమ్ సేవ్ చేస్తుంది కానీ, కొన్ని రకాల ఆహారాన్ని విషపూరితం చేసి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. ఎట్టిపరిస్థితుల్లో మైక్రోవేవ్​లో వేడి చేయకూడని ఆహారాలేంటో చూద్దాం..

  • పచ్చి గుడ్లు (షెల్‌తో) ఓవెన్​లో పెట్టకూడదు. వేడికి వీటిలో ఒత్తిడి పేరుకుపోయి పేలిపోతాయి, డోర్ తెరిచినప్పుడు ముఖానికి తగులుతుంది
  • పెంకు తీసిన ఉడకబెట్టిన గుడ్లు కూడా కొన్నిసార్లు పేలుతాయి, ముందు చిన్నగా కోసి వేడి చేయండి
  • తల్లి పాలను మైక్రోవేవ్​లో పెట్టకూడదు. వీటిలోని విలువైన యాంటీబాడీలు, విటమిన్స్ నాశనం అవుతాయి. గోరువెచ్చని నీళ్లలో బాటిల్ పెట్టి వేడి చేయాలి.
  • అల్యూమినియం ఫాయిల్, ఏదైనా మెటల్ పాత్రలను మైక్రోవేవ్​లో పెడితే స్పార్క్స్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది.
  • BPA ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లు వేడితో హానికర కెమికల్స్ ఆహారంలోకి కలుస్తాయి.
  • బంగారు,వెండి డిజైన్ ఉన్న చైనా ప్లేట్లలో మెటల్ పూత వల్ల స్పార్క్స్ వస్తాయి, అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
  • ఎర్ర మిర్చి, మిరియాల పొడి (ఎక్కువ మొత్తంలో) పెడితే ఆవిరై కళ్లు, ముక్కు మండుతాయి
  • ద్రాక్ష, బ్లూబెర్రీస్ లాంటి చిన్న పండ్లు పెట్టడం వల్ల ప్లాస్మా ఏర్పడి ఫైర్ బాల్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
  • బ్రొకోలి వేడి చేయడం వల్ల యాంటీఆక్సిడెంట్స్ నాశనం అవుతాయి. ఉడికించి తినడం మంచిది.
  • కరివేపాకు, జీలకర్ర పోపు ఉన్న కూరలు పెడితే నూనె చిటపటలాడి ఓవెన్ గోడలు మురికిగా అవుతాయి
  • పెద్ద ముక్కలుగా కోసిన ఫ్రోజెన్ మాంసం పెట్టడం వల్ల బయట వేడిగా, లోపల గడ్డకట్టి బ్యాక్టీరియా పెరుగుతుంది
  • స్టైరోఫోమ్ కప్పులు, ప్లేట్లు పెడితే లోపలి రసాయన పొర కరిగి క్యాన్సర్ కారక కెమికల్స్ ఆహారంలో కలుస్తాయి.