AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ శ్వాస వ్యాయామం తప్పక చేయాల్సిందే..

Health: ఇటీవలి కాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని కారణంగా మానవ అవయవాల్లో ప్రధానంగా ప్రభావం పడేది ఊపిరితిత్తులపైనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ శ్వాస వ్యాయామం తప్పక చేయాల్సిందే..
Healthy Lungs
Narender Vaitla
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 18, 2021 | 9:17 AM

Share

Health: ఇటీవలి కాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. దీని కారణంగా మానవ అవయవాల్లో ప్రధానంగా ప్రభావం పడేది ఊపిరితిత్తులపైనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక కరోనా మహమ్మారి కూడా శ్వాస వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా నిపుణులు చెబుతూనే ఉన్నారు. కరోనా సోకిన వారు వాసనను కోల్పోవడమే దీనికి ఉదాహరణ చెప్పవచ్చు.

అంతేకాకుండా పొగాకు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇందకోసం ఒక సింపుల్‌ వ్యాయామం అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి.

* అనంతరం రెండు అర చేతులను పొట్టపై పెట్టుకోవాలి.

* తర్వాత రెండు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ముక్కు ద్వారా శ్వాసను పీలుస్తూ 5 వరకు లెక్కబెట్టాలి.

* ఇలా గుండెల నిండా శ్వాసను తీసుకొని రెండు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి. తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ మళ్లీ 5 వరకు లెక్కించాలి.

* ఈ వ్యాయామాన్ని ఉదయాన్నే పరగడుపున 10 సార్లు చేయాలి. క్రమం తప్పుకుండా ఇలా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

ఇక కేవలం శ్వాస సంబంధిత వ్యాయామమే కాకుండా తీసుకునే ఆహారం కూడా ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుందని మీకు తెలుసా.? ఊపిరితిత్తులు నిత్యం శుభ్రంగా ఉండాలంటే.. ఉదయం నిద్రలేవగానే రెండు టీస్పూన్ల అల్లం రసం తీసుకోవాలి. ఇలా చేస్తే లంగ్స్‌ హెల్తీగా మారుతాయి. అలాగే పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి రోజూ నీటి రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.

Also Read: Priyanka Chopra: ప్రియాంక చోప్రా స్టన్నింగ్ ఫొటోస్.. చూస్తే వావ్ అనాల్సిందే

IND vs SA: దక్షిణాఫ్రికాలో భారత ఫాస్ట్ బౌలర్లదే హవా.. టాప్‌5లో దిగ్గజ స్పిన్నర్ ఒక్కడే..!

Digital News Round Up: పుష్ప రాజ్‌ సందడి | కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. లైవ్ వీడియో