IND vs SA: దక్షిణాఫ్రికాలో భారత ఫాస్ట్ బౌలర్లదే హవా.. టాప్‌5లో దిగ్గజ స్పిన్నర్ ఒక్కడే..!

IND vs SA: మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం కోహ్లీసన దక్షిణాఫ్రికా చేరుకుంది. డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగనుంది.

IND vs SA: దక్షిణాఫ్రికాలో భారత ఫాస్ట్ బౌలర్లదే హవా.. టాప్‌5లో దిగ్గజ స్పిన్నర్ ఒక్కడే..!
Ind Vs Sa
Follow us

|

Updated on: Dec 17, 2021 | 8:55 PM

IND vs SA: దక్షిణాఫ్రికాలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లలో నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, ఇతర భారత బౌలర్లతో పోలిస్తే అనిల్ కుంబ్లే దక్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడడం కూడా దీనికి పెద్ద కారణంగా నిలిచింది.

భారత మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే దక్షిణాఫ్రికాలో 12 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1441 పరుగులిచ్చి 45 వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ అతని బౌలింగ్ సగటు 32గా ఉంది. అంటే, అతను ప్రతి 32 పరుగులకు ఒక వికెట్ సాధించాడు. వీరి తర్వాత ఫాస్ట్ బౌలర్లు వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. వీరే దక్షిణాఫ్రికాలో అత్యంత విజయవంతమైన భారత ఫాస్ట్ బౌలర్లుగా మారారు.

1. జవగల్ శ్రీనాథ్: మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీనాథ్ దక్షిణాఫ్రికాలో 8 టెస్టు మ్యాచ్‌ల్లో 1087 పరుగులకు 43 వికెట్లు తీశాడు. శ్రీనాథ్ బౌలింగ్ సగటు 25గా ఉంది. అంటే శ్రీనాథ్ ఇక్కడ ప్రతి 25 పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు.

2. జహీర్ ఖాన్: జహీర్ ఖాన్ దక్షిణాఫ్రికాలో 8 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1068 పరుగులకు 30 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

3. ఎస్ శ్రీశాంత్: దక్షిణాఫ్రికాలో శ్రీశాంత్ చాలా విజయవంతమైన బౌలర్. ఇక్కడ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 771 పరుగులు ఇచ్చి 27 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ సగటు 28గా నిలిచింది.

4. మహ్మద్ షమీ: ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టులో మహ్మద్ షమీకి చోటు దక్కింది. అతను ఇక్కడ భారత్‌కు అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఐదో స్థానంలో ఉన్నాడు. షమీ ఇప్పటివరకు ఆడిన 5 టెస్టు మ్యాచ్‌ల్లో 519 పరుగులకు 21 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ యావరేజ్ కూడా చాలా బాగుంది. ప్రతి 24 పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు.

Also Read: IPL 2022 Mega Auction: లక్నో కెప్టెన్‌, హెడ్ కోచ్‌గా వారిద్దరే.. త్వరలోనే కీలక ప్రకటన..!

Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటిన 5గురు బౌలర్లు.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు సిద్ధమంటోన్న యువ ప్లేయర్స్..!

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..