- Telugu News Photo Gallery Cricket photos Vijay Hazare Trophy 2021: highest wicket taker bowlers list in vijay hazare trophy yuzvendra chahal yash thakur aniket choudhary washington sundar chintan gaja
Vijay Hazare Trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో సత్తా చాటిన 5గురు బౌలర్లు.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు సిద్ధమంటోన్న యువ ప్లేయర్స్..!
ఈ రోజుల్లో ఆటగాళ్లందరూ దేశవాళీ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శన చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తమ అద్భుత ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకునే పనిలో పడ్డారు.
Updated on: Dec 17, 2021 | 7:52 PM

Vijay Hazare Trophy 2021: ఈ రోజుల్లో దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఈ టోర్నీలో యువ బ్యాట్స్‌మెన్‌లు, బౌలర్లు అందరూ తమ సత్తాను ప్రదర్శిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదుగురు బౌలర్లపై ఓ లుక్ వేద్దాం. ఈ విషయంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో నిలిచి తన సత్తాను మరోసారి చూపించాడు.


యష్ ఠాకూర్ ఈ విషయంలో రెండవ స్థానంలో నిలిచాడు. ఈ విదర్భ బౌలర్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడగా, అందులో 14 వికెట్లు పడగొట్టాడు. తన బెస్ట్ పర్ఫార్మెన్స్‌తో ఈసారి వార్తల్లో నిలుస్తున్నాడు.

రాజస్థాన్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అనికేత్ చౌదరి నిలిచాడు. ఇప్పటివరకు అనికేత్ 5 మ్యాచ్‌లు ఆడాడు. తన అద్భుతమైన బౌలింగ్ దాడితో 13 వికెట్లు తీసుకున్నాడు.

విజయ్ హజారే ట్రోఫీలో చింతన్ గాజా గుజరాత్ తరపున బరిలోకి దిగాడు. ఇప్పటి వరకు చింతన్ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడగా, అందులో 13 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ టోర్నీలో ఆకర్షణీయంగా నిలుస్తోంది.

ఈ దేశవాళీ టోర్నీలో తమిళనాడు నుంచి వాషింగ్టన్ సుందర్ పాల్గొంటున్నాడు. ఐపీఎల్, టీమిండియాలో మంచి ప్రదర్శన కనబరిచిన ఈ యువ బౌలర్.. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు.





























