Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Soy Milk Benefits: ప్రకృతి ఇచ్చిన ఒక వరం సోయాపాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్స్‌ను దరిచేరనీయని గుణం దీని సొంతం..

Soy Milk Benefits: జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తుల వలన వచ్చే అలర్జీలున్నవారికి మంచి ప్రత్యమ్నాయ ఎంపిక ఈ వేగన్  పాలు... సోయా పాలు ప్రకృతి ఇచ్చిన ఒక వరం..

Soy Milk Benefits: ప్రకృతి ఇచ్చిన ఒక వరం సోయాపాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్స్‌ను దరిచేరనీయని గుణం దీని సొంతం..
Soyabean Milk
Follow us
Surya Kala

|

Updated on: Dec 18, 2021 | 9:10 AM

Soy Milk Benefits: జంతువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తుల వలన వచ్చే అలర్జీలున్నవారికి మంచి ప్రత్యమ్నాయ ఎంపిక ఈ వేగన్  పాలు… సోయా పాలు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. తక్కువ ఖర్చు, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సోయా పాలపై  ప్రస్తుతం ప్రపంచ జనాభా దృష్టి సారిస్తుంది. రోజు రోజుకీ మొక్కల ఆధారిత పాలకు డిమాండ్ పెరుగుతుంది. జంతువుల పాలల్లో ఆవు పాలు ఎంత శ్రేష్ఠమైనవో.. శాఖాహార పాలల్లో సోయా పాలు కూడా అంతే శ్రేష్ఠమైనవని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకనే ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలు వైపు చూస్తున్నారు.

పాలఫ్యాక్టరీలు పంపిణీ చేసే హోమోజినైజ్డ్‌ పాలతో పోలిస్తే సోయాబీన్‌ పాలు ఎంతో మెరుగు. సోయా బీన్స్ నుంచి తయారు చేసిన సోయా మిల్క్ లో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ఈ పాలలో ఇనుము, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, విటమిన్‌-సి ఎంతో అధిక శాతంలోనూ, మన రక్త ప్రసరణ వ్యవస్థకు హానికలిగించే కొవ్వు చాలా తక్కువ శాతంలో ఉన్నాయి. ఊబకాయం నుండి రక్తపోటు వరకు, సోయా పాలు చాలా ఆరోగ్య సమస్యలను నివారిస్తాయి. సోయాలోని ఐసోఫ్లేవిన్స్‌ అనే రసాయనాలు కేన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తాయన్నది తెలిసిన విషయమే. ఈరోజు శాఖాహారి పాలల్లో ప్రధమ స్థానంలో ఉన్న సోయా పాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలుసుకుందాం..

సోయా పాలల్లో బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచగల సామర్థ్యం అత్యధికం.  సోయాలోని మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు రక్త ప్రవాహంలోకి కొలెస్ట్రాల్ రవాణాను నిరోధిస్తాయి.

ఒమేగా -3 , ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు సోయాలోని శక్తివంతమైన ఫైటో-యాంటీఆక్సిడెంట్లు రక్త నాళాలను గాయాలు మరియు రక్తస్రావం నుండి సమర్థవంతంగా కాపాడుతుంది.

సోయా పాలు సహజంగా చక్కెర శాతం తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి మరొక గొప్ప ప్రయోజనం. సోయా పాలు తాగడం వల్ల అదనపు మోతాదు ఫైబర్ లభిస్తుంది. దీంతో సోయా పాలు తగిన తర్వాత చాలా సేపటి వరకూ ఆకలివేయదు.

సోయా పాలల్లో ఫైటో ఈస్ట్రోజెన్ అధికంగా ఉంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని నిరోధించగల ఒక ప్రత్యేకమైన హార్మోన్. అందుకనే సోయా పాలు పురుషులకు మంచి ఆహారం. ఈ పాలు తాగిన వారికి ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మెనోపాజ్ సమస్యలకు గొప్ప ఔషధంగా సోయాపాలు పనిచేస్తాయి. ఋతుచక్రం ఆగిపోయే సమయంలో స్త్రీలలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రుతుక్రమం ఆగిన స్త్రీలలో గుండె జబ్బులు, మధుమేహం, ఉబకాయం వచ్చే ప్రమాదం అధికం. అయితే సోయా పాలలోని ఫైటోఈస్ట్రోజెన్  మహిళల్లోని ఈస్ట్రోజెన్ భర్తీ చేస్తుంది.

సోయా పాలల్లో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉంటాయి. ఈ పాలు రోజు తాగితే..  బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది

Also Read:   భారత్‌లో బాలికలు18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోగలిగితే..పెళ్లి ఎందుకు చేసుకోకూడదన్న ఒవైసీ