AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asaduddin Owaisi: భారత్‌లో బాలికలు18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోగలిగితే..పెళ్లి ఎందుకు చేసుకోకూడదన్న ఒవైసీ

Asaduddin Owaisi: బాలికల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాల సమావేశాల్లోనే బాలికల వివాహ వయసు పెంపునకు..

Asaduddin Owaisi: భారత్‌లో బాలికలు18 ఏళ్లకే ప్రధానిని ఎంచుకోగలిగితే..పెళ్లి ఎందుకు చేసుకోకూడదన్న ఒవైసీ
Asaduddin Owaisi
Surya Kala
|

Updated on: Dec 18, 2021 | 8:28 AM

Share

Asaduddin Owaisi: బాలికల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శీతాకాల సమావేశాల్లోనే బాలికల వివాహ వయసు పెంపునకు సంబంధించిన సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చని అందరూ భావిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయసుపై చర్చ మొదలైంది.  తాజాగా ఇదే విషయంపై  AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా ట్వీట్టర్ వేదికగా ప్రభుత్వ నిర్ణయంపై అనేక ప్రశ్నలు లేవనెత్తారు.

మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రభుత్వం నుంచి మనం ఎదురుచూసిన పితృస్వామ్యం అని అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 18 ఏళ్లు నిండిన పురుషులు,  మహిళలు ఒప్పందాలపై సంతకాలు చేయవచ్చు, వ్యాపారాలు ప్రారంభించగలరు, ప్రధానమంత్రిని ఎన్నుకోగలరు.. అంతేకాదు    ఎంపీలు , ఎమ్మెల్యేలను ఎన్నుకోగలను కానీ 18 ఏళ్లకే బాలికలు వివాహం చేసుకోలేరా అంటూ ట్విట్ చేశారు.

బాలికలు రిలేషన్ షిప్‌లో జీవించడానికి కూడా అంగీకరిస్తున్నారు.. అయితే కేంద్ర ప్రభుత్వం బాలికలు 18 ఏళ్లకే తన జీవిత భాగస్వామిని ఎంచుకోలేరని  చెప్పడం చాలా తమాషాగా ఉందన్నారు. “స్త్రీ, పురుషులు ఇద్దరూ 18 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతించాలి.. ఎందుకంటే అన్నిటికీ 18 ఏళ్లకే చట్టం వారిని పెద్దలుగా పరిగణిస్తుందని చెప్పారు అసదుద్దీన్ ఒవైసీ.

బాల్య వివాహాలను నిషేధిస్తూ చట్టం ఉన్నప్పటికీ బాల్య వివాహాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఒవైసీ అన్నారు. భారతదేశంలోని  ఏటా అనేకమంది బాలికలకు 18 ఏళ్లలోపు వివాహాలు జరుగుతున్నాయని.. అయితే దేశ వ్యాప్తంగా  బాల్య వివాహాలపై 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పారు. అయితే బాల్య వివాహాలు చాలా వరకూ తగ్గుముఖం పట్టాయంటే దానికి కారణం చట్టం కాదు.. బాలికల్లో వచ్చిన విద్య , ఆర్థిక పురోగతి మాత్రమే కారణమని చెప్పారు.

అంతేకాదు ప్రధాని మోడీ కి నిజాయితీ ఉంటే మహిళలకు ఆర్థిక అవకాశాలను పెంపొందించడంపై దృష్టి సారించి ఉండేవారని ఒవైసీ అన్నారు. శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యం తగ్గుతున్న ఏకైక దేశం భారతదేశం. ఇది 2005లో 26% నుండి 2020లో 16%కి పడిపోయిందని చెప్పారు.

Also Read:  కమనీయంగా సాగిన మీనాక్షి కళ్యాణం ప్రదర్శన.. తన జీవితంలో ఇద్దరు ముఖ్య వ్యక్తుల గురించి చెప్పిన త్రివిక్రమ్..