AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye Care Tips: షుగర్ లేదని స్వీట్స్ తెగ లాగించేస్తున్నారా.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం

మారిన జీవన శైలిలో తినే తిండి నుంచి నిద్రపోయే సమయం వరకూ అనేక అలవాట్లలో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆధునిక ఆహారాలలో స్వీట్ల వినియోగం పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఇలా ఎక్కువ స్వీట్లు తినే అలవాటు కనుక మీకు ఉంటే వెంటనే స్వస్తి చెప్పామని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ అలవాటు కళ్ళకు హాని కలిగిస్తుందట. దృష్టిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.

Eye Care Tips: షుగర్ లేదని స్వీట్స్ తెగ లాగించేస్తున్నారా.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం
Eye Health Tips
Surya Kala
|

Updated on: Sep 25, 2025 | 1:09 PM

Share

మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ప్రజలు తమ రోజువారీ ఆహారంలో అధిక మొత్తంలో చక్కెరను తీసుకునేలా చేస్తున్నాయి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అధిక చక్కెర వినియోగం మధుమేహానికి దోహదం చేస్తుంది. అంతేకాదు రెటీనాలోని చిన్న రక్త నాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన కంటి వ్యాధి అయిన డయాబెటిక్ రెటినోపతి ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ స్థితిలో కంటి చూపు క్రమంగా క్షీణిస్తుంది.

ఈ సమస్య మధుమేహ రోగులకు మాత్రమే పరిమితం కాదు.. అధిక మొత్తంలో చక్కెరను తీసుకునే ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా ప్రమాదంలో పడవచ్చు. దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. దృష్టిపై ప్రభావం చూపుతుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన కళ్ళ కోసం స్వీట్స్ తీసుకోవడం నియంత్రించడం చాలా ముఖ్యం.

సర్ గంగా రామ్ హాస్పిటల్‌లోని కంటి విభాగం మాజీ HOD డాక్టర్ ఎ.కె. గ్రోవర్ … ఇదే విషయంపై మాట్లాడుతూ.. అధిక చక్కెర వినియోగం వలన కలిగే ప్రభావం కంటిపై పడితే.. దానిని మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే లక్షణాలు క్రమంగా కనిపిస్తాయి. అత్యంత సాధారణ లక్షణం దృష్టి మసకబారడం. అదనంగా వ్యక్తులు తమ కళ్ళ ముందు నల్లటి మచ్చలు ఉన్నట్లు ఫీల్ అవుతారు. కొన్నిసార్లు రాత్రి సమయంలో చూపు అస్పష్టంగా మారుతుంది. దీని వలన డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది కలుగుతుంది. తరచుగా కంటి ఇన్ఫెక్షన్లు లేదా వాపు కూడా ఒక సంకేతం కావచ్చు. కొంతమందికి మొబైల్ లో చదవడంలో లేదా చూడటంలో ఇబ్బంది ఉంటుంది. చక్కెర స్థాయి ఎక్కువ ఉన్నవారి కళ్ళలో ఒత్తిడి ఏర్పడుతుంది. నొప్పితో బాధపడతారు. ఈ లక్షణాలన్నీ దృష్టి లోపం, డయాబెటిక్ రెటినోపతిని సూచిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే సకాలంలో చికిత్స ప్రారంభించడానికి కంటి వైద్యుడు వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

ఎక్కువ స్వీట్లు తినడం కళ్ళకు ఎలా హానికరం అంటే

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన ప్రకారం శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు అది నేరుగా రెటీనాను ప్రభావితం చేస్తుంది. అధిక చక్కెర స్థాయిలు రెటీనాలోని చిన్న రక్త నాళాలను బలహీనపరుస్తాయి, దీనివల్ల అవి ఉబ్బుతాయి. కొన్నిసార్లు రక్తం లేదా ద్రవం లీక్ అవుతాయి. ఈ పరిస్థితి చివరికి డయాబెటిక్ రెటినోపతిగా అభివృద్ధి చెందుతుంది. ఇది దృష్టిని ప్రభావితం చేస్తుంది.

క్రమం తప్పకుండా ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల రెటీనా తగినంత ఆక్సిజన్ పొందకుండా నిరోధిస్తుంది. ఇది అసాధారణమైన కొత్త రక్త నాళాలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ నాళాలు పెళుసుగా ఉంటాయి. నాళాలు పగిలిపోతే కళ్ళలో రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఫలితంగా దృష్టి మసకబారుతుంది లేదా అంధత్వం కూడా వస్తుంది. చక్కెర కంటి లెన్స్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది కంటిశుక్లం అభివృద్ధికి దారితీస్తుంది. కనుక చక్కెర తీసుకోవడం పరిమితం చేయాలి.

ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి

  1. రోజువారీ చక్కెర తీసుకోవడం పరిమితం చేయండి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వంటి పానీయాలను నివారించండి.
  2. ఎక్కువ స్వీట్లు తినడానికి బదులుగా పండ్లు , ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి.
  3. రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ ఉండండి.
  4. కనీసం సంవత్సరానికి ఒకసారి కళ్ళను చెక్ చేయించుకోండి
  5. మంచి కంటి ఆరోగ్యం కోసం తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు,ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి.
  6. దృష్టి మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?