- Telugu News Photo Gallery Spiritual photos Sun Nakshatra Transit September 27th 2025: to get good luck for these four Zodiac Signs
Astro Tips: నక్షత్రాన్ని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 4 రాశుల వారి జాతకం సూర్యుడిలా వెలిగిపోతుంది..
గ్రహ సంచారాలు, నక్షత్రరాశి మార్పులు జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక నుంచి మరొక రాశిలోకి.. ఒక రాశిలో ఉన్నప్పుడే నక్షత్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఇలా నక్షత్ర మార్పు కూడా మొత్తం 12 రాశుల జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అటువంటి ముఖ్యమైన ఖగోళ సంఘటన సెప్టెంబర్ 27న జరగనుంది. నవగ్రహ అధినేత సూర్యుడు నక్షత్రాన్ని మర్చుకోనున్నాడు. కొన్ని రాశుల జాతకం సూర్యుడిలా ప్రకాశిస్తుంది.
Updated on: Sep 25, 2025 | 12:36 PM

సెప్టెంబర్ 27న సూర్యుడు తన నక్షత్రరాశిని మార్చుకోనున్నాడు. ఇది అన్ని రాశుల జీవితాలను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుని నక్షత్రరాశుల మార్పు ఒక వ్యక్తి జీవితంలో గణనీయమైన మార్పుకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈసారి సూర్యుడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం నుంచి హస్త నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో ఉన్నప్పుడు సూర్యగ్రహణం సంభవించింది. అందువల్ల.. సెప్టెంబర్ 27న సూర్యుని నక్షత్ర మార్పు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ మార్పు గ్రహణం ప్రభావాన్ని తగ్గిస్తుందని నమ్మకం. సూర్యుడు హస్త నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు, కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కలుగుతాయి. సూర్యుడి వలెనే వీరి జీవితం వెలుగుతో నిండుతుంది.

ఈ నక్షత్ర మార్పు ఎందుకు ప్రత్యేకమైనది.. ఈ నక్షత్ర మార్పు జ్యోతిషశాస్త్ర దృక్పథంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇటీవల ఏర్పడిన సూర్య గ్రహణం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవించింది. జ్యోతిష్కుల ప్రకారం సూర్యుని నక్షత్ర మార్పు గ్రహణం వలన ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది. సూర్యుడు హస్త రాశిలోకి ప్రవేశించడం వల్ల అనేక రాశుల జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. సూర్యుడు హస్త రాశిలోకి ప్రవేశించడం ప్రభుత్వ ఉద్యోగస్తులకు, సామాన్యులకూడా శుభప్రదం మాత్రమే.. అంతేకాదు ఈ రాశులకు చెందిన వ్యక్తుల ఆత్మవిశ్వాసం, శక్తిని కూడా పెంచుతుంది. సూర్యుని నక్షత్ర మార్పు నాలుగు రాశులకు ఫలవంతంగా ఉంటుంది.

వృషభ రాశి: ఈ సమయం వృషభ రాశి వారికి ఆర్థికంగా , వృత్తిపరంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రమోషన్, కొత్త ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.

కన్య రాశి: కన్య రాశి వారికి ఆరోగ్యం, కుటుంబ విషయాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంకా, విద్య , వృత్తి రంగాలలో కూడా శుభ ఫలితాలు సాధించవచ్చు.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఈ సమయం ప్రయాణాలు, పెట్టుబడులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థిక లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి: మకర రాశి వారికి ఈ సమయం వ్యక్తిగత , వృత్తి జీవితంలో ఆనందం , విజయాన్ని సూచిస్తుంది. కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతాయి. కొత్త సంబంధాలు బలపడతాయి.




