- Telugu News Photo Gallery Spiritual photos Shardiya navratri 2025: places to light diyas on ashtami and navami for goddess durgadevi blessings
డబ్బుకి ఇబ్బందులా.. నవరాత్రి అష్టమి, నవమి తిథుల్లో ఈ పరిహారం ఫలవంతం..
ఆశ్వయుజ మాసంలో శరత్ వెన్నెలలో జరుపుకునే నవరాత్రులను దేవీ నవరాత్రులని, శరదీయ నవరాత్రులని, శారద నవరాత్రులని అంటారు. ఈ ఏడాది ఈ నవరాత్రులను పది రోజులు జరుపుకోనున్నారు. అయితే నవరాత్రి సమయంలో వచ్చే అష్టమి , నవమి తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది అష్టమి పూజ సెప్టెంబర్ 30న, నవమి పూజ నవంబర్ 1న నిర్వహించనున్నారు. కనుక ఈ రెండు తిథుల్లో ఇంట్లో ఈ ప్రదేశాలలో దీపాలను వెలిగించడం వల్ల దుర్గాదేవి ఆశీస్సులు లభించడమే కాదు ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదని నమ్మకం.
Updated on: Sep 25, 2025 | 12:10 PM

పవిత్రమైన దేవీ నవరాత్రి దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఈ నవరాత్రిలో ఎనిమిదవ , తొమ్మిదవ రోజులలో మహాగౌరి దేవి, సిద్ధిదాత్రి దేవికి పూజలను చేస్తారు. అయితే నవరాత్రిలో ఎనిమిదవ, తొమ్మిదవ రోజులలో ఇంట్లో దీపాలు వెలిగించడం వలన దుర్గాదేవి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం. ఈ రోజు దీపానికి సంబంధించిన కొన్ని నివారణలను తెలుసుకుందాం.. వాటిని ఆచరిస్తే ఖచ్చితంగా దేవత ఆశీస్సులు లభిస్తాయి.

డబ్బు సమస్యలు పరిష్కారం కోసం: శారదయ నవరాత్రుల సమయంలో ముఖ్యంగా 8,9 రోజుల్లో సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఆశీస్సులను పొందుతాడు. ఈ పరిహారం ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. దీపం జ్వాల ఉత్తరం వైపు ఉండేలా జాగ్రత్త వహించండి.

సానుకూలత కోసం: దుర్గాదేవికి పూజ చేసిన తర్వాత ఇంటి పూజ గదిలో దీపం వెలిగించాలి. అంతేకాదు ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వలన ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.

అమ్మ ఆశీర్వాదం కోసం: వాస్తు శాస్త్రం ప్రకారం అష్టమి , నవమి తిథుల్లో ఇంటి ఈశాన్య మూలలో దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. కనుక నవరాత్రి ఎనిమిదవ, తొమ్మిదవ రోజున ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. అలా చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులపై ఉంటాయి.

ఈ ప్రదేశాలలో కూడా దీపాలు వెలిగించవచ్చు: నవరాత్రి సమయంలో అష్టమి , నవమి రోజున అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఇంటి డబ్బులు పెట్టుకునే ప్లేస్ లో లేదా సేఫ్ దగ్గర దీపం వెలిగించవచ్చు. ఇది మీ ఖజానా ఎల్లప్పుడూ నిండి ఉండేలా చేస్తుంది. సాయంత్రం మెట్ల దగ్గర దీపం వెలిగించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది.




