Health: పండుగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా.. ఇలా చేయకుంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు..

పండుగ సమయాల్లో స్వీట్స్ కు కొదవే ఉండదు. ఇంట్లో చేసినవే కాకుండా బయటి నుంచి తెచ్చినవి కూడా ఉంటాయి. వీటితో పాటు ఐస్ క్రీమ్ లు, నమ్ కీన్ లు అదనం. ఇలా రుచులతో కట్టిపడేసే సమయంలో వాటిని..

Health: పండుగ సమయంలో నోటిని అదుపు చేసుకోలేకపోతున్నారా.. ఇలా చేయకుంటే మాత్రం ఎన్నో ఇబ్బందులు..
Eating Health
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 28, 2022 | 1:59 PM

పండుగ సమయాల్లో స్వీట్స్ కు కొదవే ఉండదు. ఇంట్లో చేసినవే కాకుండా బయటి నుంచి తెచ్చినవి కూడా ఉంటాయి. వీటితో పాటు ఐస్ క్రీమ్ లు, నమ్ కీన్ లు అదనం. ఇలా రుచులతో కట్టిపడేసే సమయంలో వాటిని రుచిచూడకుండా ఉండలేం. అయితే ప్రతి పదార్థాన్ని తినడం కారణంగా వచ్చే ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోం. చివరకు అజీర్తి, చికాకుతో ఇబ్బంది పడుతుంటాం. ఇలాంటి పండుగ సమయాల్లో ఆరోగ్యకరమైన ఫుడ్ అలవాట్లను మెయింటేన్ చేయడం చాలా అవసరం. మనలో చాలా మందికి పండుగ సమయాల్లో కాజు కట్లీస్, సోన్ పాప్డీలు, చాట్స్, పిజ్జా, పాస్తా, ఫ్రైడ్ ఐటమ్స్ తినడం అలవాటు. అయితే ఎక్కువగా తినడం గురించి ఆందోళన చెందుతున్నట్లయితే ఈ చిట్కాలను పాటించడం ఉత్తమం.

నిమ్మకాయ రసం.. నిమ్మకాయ నీళ్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఒక గ్లాస్ నిమ్మ రసం తాగితే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ తర్వాత ఉప్పు కలుపుకుని ఓ సారి, చక్కెర కలుపుకుని మరోసారి, ఇంకొంత సమయం తర్వాత గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

కూరగాయలతో విందు.. మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఉడికించిన లేదా పచ్చి కూరగాయలను తినడం ఉత్తమం. ఫైబర్ కంటెంట్ కోసం బఠానీలు, బీన్స్, ఆకుకూరలు, క్యారెట్లు తినాలి.

ఇవి కూడా చదవండి

స్నాక్స్.. వడలు, కుకీలను తినడానికి బదులుగా చిరుతిండి కోసం డ్రై ఫ్రూట్స్, నట్స్ ను ఎంచుకోవాలి. ఈ సమయంలో తాజా పండ్లను కూడా చేర్చుకోవచ్చు.

బరువు విషయంలో జాగ్రత్త.. వేడుకల సమయంలో చాలా మంది బరువు పెరుగుతారు. కేలరీలు అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. పండుగ తర్వాత సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.

తీపి పదార్థాలకు దూరం.. స్వీట్లు, పానీయాల రూపంలో మనం తీసుకునే చక్కెర శరీరంలో ఇన్సులిన్ ను పెంచుతుంది. పర్యవసానంగా ప్యాంక్రియాస్ ఒత్తిడికి గురవుతుంది. తద్వారా బరువు పెరగడం, మధుమేహం, అలసట వంటి సమస్యలు చుట్టుముడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!