Mouth Wash: మౌత్‌వాష్‌ను తరచూ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే

మౌత్ వాష్ లో  ఉండే కెమికల్స్‌తో నోటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అలాగే నోరు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.

Mouth Wash: మౌత్‌వాష్‌ను తరచూ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే
Mouth Wash
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2022 | 2:10 PM

నోటి సంరక్షణ విషయానికి వస్తే, చాలా మంది బ్రషింగ్‌తో పాటు మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తారు. ఎందుకంటే మౌత్ వాష్ నోటి దుర్వాసనను పోగొట్టి తాజా అనుభూతిని ఇస్తుంది. అయితే దీన్ని ప్రతిరోజూ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని చాలా మందికి దీని గురించి తెలియదు. ముఖ్యంగా  మౌత్ వాష్ లో  ఉండే కెమికల్స్‌తో నోటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అలాగే నోరు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే మౌత్‌వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. మీరు దానిని ఎక్కువగా ఉపయోగిస్తే నోరు పొడిబారుతుంది. అలాగే చికాకు, దురద వంటి సమస్యలు కలుగుతాయి. ఇక మౌత్ వాష్ వల్ల కొందరిలో దంతక్షయ సమస్యలు తలెత్తుతాయి. అలాగే మరికొందరిలో నోటి సమస్యలు కలుగుతాయి.  ఈ నేపథ్యంలో దంత సమస్యలు, నోటి సమస్యలున్నవారు మౌత్‌వాష్‌ను ఉపయోగించకపోవడం మంచిదంటున్నారు నిపుణులు.

కాగా మౌత్‌వాష్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కారకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని సింథటిక్ పదార్థాలతో నోటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి రోజూ మౌత్ వాష్ ఉపయోగించేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు రోజూ ఎక్కువగా మౌత్ వాష్ ఉపయోగిస్తే దంతాలు రంగు మారవచ్చు. ముఖ్యంగా ఇందులోని రసాయనాలతో దంతాలు పసుపు రంగులోకి మారిపోతాయి. అలాగే దంతక్షయం, చిగుళ్ల నొప్పి తదితర సమస్యలు బాధిస్తాయి. కాబట్టి మౌత్‌ వాష్‌ వాడకం విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే