Basil Benefits: ఎన్నో రోగాలకు నివారిణి.. తులసి ఆకులు.. ఎలా తీసుకోవాలో తెలుసా..
తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం తులసి ఒక ఔషధ మొక్క. తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లల్లో తులసి మొక్క..
తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలుసు. ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం తులసి ఒక ఔషధ మొక్క. తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. చాలా మంది ఇళ్లల్లో తులసి మొక్క ఉంటుంది. తుసి మొక్కకు పూజలు కూడా చేస్తారు. ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావించి ప్రతిరోజు పూజలు కూడా చేస్తారు.అయితే తులసి ఆకులతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేదంలో తులసి మొక్కను ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా చెబుతారు. దీని ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంటు వ్యాధులను దూరం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకులు నమలడం, నీటిలో మరిగించి తీసుకోవడం లేదా మరేరకంగానైనా తీసుకోవచ్చు. తులసి ఆకులు తినడం ద్వారా ఈ కింది ప్రయోజనాలు ఉంటాయి. రోజూ ఖాళీ కడుపుతో 10 నుంచి 12 తులసి ఆకులను నమలడం వలన ఒత్తిడి నుండి బయటపడతారు.
తులసి ఆకుల్లోని గుణాలు శరీరంలో ఒత్తిడికి కారకమయ్యే కార్టిసాల్ అనే హర్మోన్ ఉత్పత్తిని అదుపు చేయగలవని పరిశోధనలో తేలింది. ఈ హర్మోన్ ఉత్పత్తి తగ్గినపుడు, ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి. తులసి ఆకుల్లో లో యూజినాల్, మిథైల్ యూజినాల్, కారియోఫిలీన్ వంటి మూలకాలు ఉంటాయి, ఇవి ప్యాంక్రియాటిక్ బీటా కణాలను సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యాన్ని కల్పిస్తాయి. దీంతో శరీరంలో ఇన్సులిన్ సమతుల్యంగా ఉంటుంది, రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. తద్వారా ఇది మధుమేహాన్ని నివారిస్తుంది.
నోటి నుండి దుర్వాసన వస్తుంటే, కొన్ని తులసి ఆకులను నమిలితే నోటి దుర్వాసన తొలగిపోతుంది. తులసి గుణాలు సీజనల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. సైనసైటిస్, అలెర్జీలు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు ఉంటే, తులసి ఆకులను నీటిలో బాగా మరిగించి, ఆ తర్వాత వాటిని ఫిల్టర్ చేయాలి. ఈ ఫిల్టర్ చేసిన నీటిని కొద్దికొద్దిగా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల జలుబు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా తులసీ ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, వీటిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు మటుమాయం అవుతాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..