AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skin Care Tips: ఈ సింపుల్ టిప్స్ తో.. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు..

చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.  చర్మం మృదువుగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది మాత్రం స్కిన్ ప్రొటక్షన్ పై ఎటువంటి శ్రద్ధ తీసుకోరు. బయటకు వెళ్లినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ తీసుకున్న..

Skin Care Tips: ఈ సింపుల్ టిప్స్ తో.. చర్మ  సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు..
Skin Care Tips
Amarnadh Daneti
|

Updated on: Oct 28, 2022 | 1:41 PM

Share

చర్మ సౌందర్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.  చర్మం మృదువుగా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది మాత్రం స్కిన్ ప్రొటక్షన్ పై ఎటువంటి శ్రద్ధ తీసుకోరు. బయటకు వెళ్లినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ తీసుకున్న దాని ప్రభావం ఫస్ట్ స్కిన్​ మీదే పడుతుంది. అది చర్మాన్ని నల్లగా చేస్తుంది. అంతే కాకుండా స్కిన్ నిర్జీవంగా కనిపించేలా చేస్తుంది. కొన్ని సింపుల్ ట్రిక్స్ తో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల లేదా ట్రాఫిక్ కాలుష్యం వల్ల హైపర్పిగ్మెంటేషన్, సన్ టాన్ ఏర్పడుతుంది. పైగా ఈ వర్షాకాలంలో కూడా వేడి ఎక్కువగానే ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల చర్మం ముదురు రంగులో మారే అవకాశముంది. అధిక సూర్యరశ్మి వలన హైపర్పిగ్మెంటేషన్, సన్బర్న్, డార్క్ స్పాట్స్ ఏర్పడవచ్చని సూచిస్తున్నారు. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి అనేక ఔషధాలు వాడటం కంటే ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు అంని సూచిస్తున్నారు.

నిమ్మ, తేనె

ఒక టేబుల్ స్పూన్ తేనెతో తాజా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి.. 20 నిమిషాలు అలాగే ఉంచాలి. అనంతరం గోరు వెచ్చని నీటితో లేదా చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే టాన్ తొలగిపోతుంది.

శెనగపిండి

శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. దానిని ఒక మృదువైన పేస్ట్ గా తయారుచేయాలి. దానిని మీ చర్మంపై అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరనిచ్చి.. ఆపై దానిని కడగాలి. ఈ చిట్కాను చాలామంది ఎప్పటినుంచో వినియోగిస్తున్నారు. ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

పండ్లు, కూరగాయలు

పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

కొబ్బరి పాలు

కొబ్బరి పాలలో దూదిని నానబెట్టాలి. దానిని 15 నిమిషాలు అలాగే ఉంచి.. అనంతరం దానితో శరీరాన్ని లేదా టాన్ ఉన్న ప్రదేశాన్ని ప్యాక్ చేసి.. తర్వాత దానిని చల్లని నీటితో కడగాలి. కొబ్బరి పాలు టాన్ రిమూవ్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా చర్మానికి మంచి రక్షణ, పోషణ అందిస్తాయి. అందుకే చాలా బ్యూటీ ప్రొడెక్ట్స్​లో కొబ్బరిపాలు ఉపయోగిస్తారు.

కలబంద

అలోవెరా జెల్ తీసుకుని చర్మానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబంద గుజ్జులో పసుపు కలిపి రాసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us
రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
రూ.1.5 లక్షల లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్!
15 ఏళ్ల వైభవ్‌పై అందరి చూపు.. అభిషేక్‌తో కలిసి చెలరేగుతాడా?
15 ఏళ్ల వైభవ్‌పై అందరి చూపు.. అభిషేక్‌తో కలిసి చెలరేగుతాడా?
మా వాళ్లు మారరు.. సొంత టీంపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!
మా వాళ్లు మారరు.. సొంత టీంపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!
ఇన్సూరెన్స్ లేకపోతే టోల్ ప్లాజాల వద్ద చలాన్లు వేస్తారా?
ఇన్సూరెన్స్ లేకపోతే టోల్ ప్లాజాల వద్ద చలాన్లు వేస్తారా?
నెటిజన్‌కు ఇచ్చి పడేసిన కీర్తి సురేష్
నెటిజన్‌కు ఇచ్చి పడేసిన కీర్తి సురేష్
రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులోకి..
రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులోకి..
భారతీయులకు షాక్.. మలేషియా వెళ్లాలంటే వీసా తప్పనిసరి..
భారతీయులకు షాక్.. మలేషియా వెళ్లాలంటే వీసా తప్పనిసరి..
వాహనాలు ఆగాల్సిందే.. పాములు వెళ్లాల్సిందే! ఇదో వింత రోడ్డు!
వాహనాలు ఆగాల్సిందే.. పాములు వెళ్లాల్సిందే! ఇదో వింత రోడ్డు!
బంగ్లాదేశ్‌పై గెలుపుతో సౌతాఫ్రికా కెప్టెన్ ప్రపంచ రికార్డు
బంగ్లాదేశ్‌పై గెలుపుతో సౌతాఫ్రికా కెప్టెన్ ప్రపంచ రికార్డు
ఒంటరి పోరాటంతో హెన్రీ నికోల్స్ 175 నాటౌట్.. న్యూజిలాండ్ 368 ఆలౌట్
ఒంటరి పోరాటంతో హెన్రీ నికోల్స్ 175 నాటౌట్.. న్యూజిలాండ్ 368 ఆలౌట్