Electronic Gadget’s Effects: మెదడుపై మొబైల్, గాడ్జెట్‌ల ప్రభావం ఎలా ఉంటుందో తెలిస్తే..
ఈ గాడ్జెట్‌లపై మనం ఆధారపడటం అనేది ఆందోళన కలిగించే విషయం. ఈ గాడ్జెట్‌లు మన జీవితాలను సులభతరం చేశాయి కానీ ఇప్పుడు వాటి పెరుగుతున్న వ్యసనం మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీనిని డిజిటల్ అడిక్షన్ అంటారు. దీని వల్ల మనుషుల్లో ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్, ఒత్తిడి వంటివి కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్‌లకు ..

ఈ సాంకేతికతలు లేకుండా జీవించడం కష్టంగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వల్ల మంచికంటే చెడు ఎక్కువగా జరిగిపోతుంది. అది ఫోన్, టాబ్లెట్ లేదా మరే ఇతర గాడ్జెట్లపైన మనం ఆధారపడటం ఎంతగానో పెరిగిపోయింది. అవి మన జీవితంలో ఒక భాగమయ్యాయి. కానీ ఈ ఫోన్‌లు ఎంత మేలు చేస్తున్నాయో.. అంత కీడు కూడా చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫోన్లు, గాడ్జెట్‌లు మన మెదడును తీవ్రంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు సైతం ఈ ఫోన్‌లకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.
మెదడుపై గాడ్జెట్‌ల ప్రభావం:
ఈ గాడ్జెట్‌లపై మనం ఆధారపడటం అనేది ఆందోళన కలిగించే విషయం. ఈ గాడ్జెట్‌లు మన జీవితాలను సులభతరం చేశాయి కానీ ఇప్పుడు వాటి పెరుగుతున్న వ్యసనం మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దీనిని డిజిటల్ అడిక్షన్ అంటారు. దీని వల్ల మనుషుల్లో ఏకాగ్రత లోపించడం, డిప్రెషన్, ఒత్తిడి వంటివి కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే లైక్‌లకు జనాలు అడిక్ట్ అవుతున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో ఫోన్‌ల కారణంగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
తాజాగా దీనిపై చేసిన పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సాంకేతికత వినియోగంపై నిర్వహించిన అధ్యయనాలు దాని మితిమీరిన వినియోగం మన జ్ఞాపకశక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని తేలింది. మన మెదడు ఒకే సమయంలో అనేక ప్రదేశాల నుండి సమాచారాన్ని స్వీకరిస్తుంది. అటువంటి పరిస్థితిలో మెదడు మొత్తం సమాచారాన్ని త్వరగా గుర్తుంచుకోవడం కష్టం. ఒకేసారి ఎక్కువ సైట్‌లు, యాప్‌లలో పని చేస్తున్నందున ఇదంతా మా మల్టీ టాస్కింగ్ కారణంగా జరిగింది. పెద్దల నుంచి చిన్నారుల వరకు ఈ ఫోన్‌లకు అలవాటు పడటంతో దాని ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దీని వల్ల రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి.
- ఏకాగ్రత లేకపోవడం
- పని మీద శ్రద్ద లేకపోవడం
- గుర్తుంచుకోవడంలో ఇబ్బంది వంటి ప్రభావాలు
- శారీరక, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి
అంతే కాకుండా వీటి వాడకం వల్ల మన శారీరక, మానసిక సమస్యలు కూడా పెరుగుతున్నాయి.
- ఒత్తిడి, తలనొప్పి
- మెడ, వెన్నునొప్పి
- కార్పాల్ టన్నెల్ సిండ్రోమ్
- డిప్రెషన్
ఇది కాకుండా, ఈ గాడ్జెట్‌ల వల్ల సామాజిక దూరం కూడా పెరుగుతోంది. అందరు కలిసి కూర్చుంటారని అంటారు కానీ అందరూ మొబైల్ ఫోన్లతో బిజీ గా ఉంటున్నారు. దీని వల్ల ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో ఒంటరితనం పెరిగిపోతోంది. అవసరమైనంత వరకు ఈ సాధనాలను ఉపయోగించండి. దానికి అలవాటు పడకండి. మీ శారీరక, మానసిక ఆరోగ్యంగా ఉండండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి