Chicken Avakaya: చికెన్ ఆవకాయ పచ్చడి ఇలా చేయండి.. మాటలు ఉండవు!
నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ అనగానే ఎగిరి గంతేస్తారు. చికెన్, మటన్ తో ఎక్కువగా బిర్యానీలు, రక రకాల కర్రీలు, ఫ్రైలు చేస్తూ ఉంటారు. సరిగ్గా మసాలాలు పెట్టి వండితే టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఇప్పటికే మనం చికెన్, మటన్ తో తయారు చేసే ఐటెమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో నోరూరించే ఐటెమ్ ని మీకు పరిచయం చేస్తున్నాం. అదే చికెన్ ఆవకాయ.. చికెన్ పచ్చడి తెలుసు కానీ.. చికెన్ ఆవకాయ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది మరి. వేడి వేడి అన్నంలోకి..

నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ అనగానే ఎగిరి గంతేస్తారు. చికెన్, మటన్ తో ఎక్కువగా బిర్యానీలు, రక రకాల కర్రీలు, ఫ్రైలు చేస్తూ ఉంటారు. సరిగ్గా మసాలాలు పెట్టి వండితే టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఇప్పటికే మనం చికెన్, మటన్ తో తయారు చేసే ఐటెమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో నోరూరించే ఐటెమ్ ని మీకు పరిచయం చేస్తున్నాం. అదే చికెన్ ఆవకాయ.. చికెన్ పచ్చడి తెలుసు కానీ.. చికెన్ ఆవకాయ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది మరి. వేడి వేడి అన్నంలోకి.. కొద్దిగా చికెన్ పచ్చడి వేసుకుని అలా తింటే.. ఇక మాటలు ఉండవు.. ఓన్లీ కుమ్ముడే. మరి ఈ చికెన్ ఆవకాయను ఎలా తయారు చేస్తారు? తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
చికెన్ ఆవకాయకు కావాల్సిన పదార్థాలు:
చికెన్, ఉప్పు, కారం, పసుపు, నూనె, జీడి పప్పు, బాదం పప్పు, లవంగాలు, యాలకులు, నిమ్మ కాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్.
చికెన్ ఆవకాయ తయారీ విధానం..
ముందుగా ఒక కిలో చికెన్ ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలకు ఉప్పు, పసుపు పట్టించి అర గంట పాటు పక్కన పెట్టు కోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ముక్కల్లోని నీరంతా పోయే దాకా వేయించు కోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో పాన్ తీసుకుని.. యాలకులు, లవంగాలు వేయించు కోవాలి. వీటిల్లోకి జీడి పప్పు 5, బాదం 5 పప్పులను కూడా వేసి పౌడర్ గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ వేయించిన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో అల్లం పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక.. మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసి ఓ రెండు నిమిషాల పాటు వేయించు కోవాలి. ఆ తర్వాత చికెన్ కూడా వేసి కారం, ఉప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. చికెన్ ని కాస్త చల్లారనివ్వాలి. వేడి చల్లారాక నిమ్మ రసం కూడా వేసి కలుపు కోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ సిద్ధం. ఓ మూడు రోజుల పాటు చికెన్ ఆవకాయను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మొత్తం ఆవకాయను కలుపుకుని.. వేడి అన్నంలోకి వేసుకుని తింటే మాటలు ఇక ఉండవు.