- Telugu News Photo Gallery If you don't have time to have breakfast, have smoothie for breakfast, Know benefits here
Smoothie: ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు టైం లేదా? ఈజీగా స్మూతీ లాగించేయండి..
ఒక్కోసారి సమయంలేకపోవడం వల్ల ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండానే హడావిడిగా ఆఫీస్‌కు పరుగులు తీస్తుంటారు. అలాంటప్పుడు సులువుగా స్మూతీ తయారు చేసుకుని తాగవచ్చు. ఇవి రుచిని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దైనందిన జీవితంలో రోజంతా శక్తివంతంగా ఉండేందుకు అల్పాహారం తప్పనిసరి. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం రోజంతా శక్తిని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది..
Updated on: Dec 07, 2023 | 8:44 PM

ఒక్కోసారి సమయంలేకపోవడం వల్ల ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండానే హడావిడిగా ఆఫీస్‌కు పరుగులు తీస్తుంటారు. అలాంటప్పుడు సులువుగా స్మూతీ తయారు చేసుకుని తాగవచ్చు. ఇవి రుచిని అందించడమే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దైనందిన జీవితంలో రోజంతా శక్తివంతంగా ఉండేందుకు అల్పాహారం తప్పనిసరి. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం రోజంతా శక్తిని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

అయితే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడానికి సమయం లేకపోతే, తక్కువ సమయంలో స్మూతీ తయారు చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో స్మూతీని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో నిపుణుల మాటల్లో మీకోసం..స్మూతీ ఆరోగ్యకరమైన పానీయం. ఇది రోజంతా శరీరం చురుకుగా, శక్తివంతంగా ఉంచుతుంది.

ఇందులో ఉపయోగించే పదార్ధాల్లో విటమిన్లతో పాటు చాలా ఖనిజాలు, ఫైబర్, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇది రోజంతా శక్తిని అందిస్తుంది. చలికాలంలో తక్కువ నీరు తాగడం వల్ల శరీరం సులువుగా డీహైడ్రేట్ అవుతుంది. అల్పాహారంగా స్మూతీని తీసుకుంటే, శరీరం పూర్తి హైడ్రేషన్ అవుతుంది. పాలు, పెరుగు, పండ్లు లేదా కూరగాయలతో చేసిన స్మూతీని తీసుకుంటే మంచిది.

ఉదయాన్నే స్మూతీని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా సాఫీగా మారుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. ప్రేగుల వ్యవస్థను నియంత్రిస్తుంది. స్మూతీలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని బలపరుస్తుంది. కొవ్వు వేగంగా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది.

స్మూతీ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మీకు ఇష్టమైన పండ్లన్నింటినీ మిక్స్ చేయడం ద్వారా ఉదయం చాలా తక్కువ సమయంలో స్మూతీని సిద్ధం చేసుకోవచ్చు. ఇది త్రాగడానికి ఎంత రుచిగా ఉంటుందో, అద్భుతమైన పోషణను కూడా అందిస్తుంది. మీకు ఇష్టమైన ఆహార పదార్థాల కలయికతో ప్రతిరోజూ కొత్త రకాల స్మూతీలను రుచి చూడవచ్చు.





























