AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Care: పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

ఇంట్లో చంటి పిల్లలు ఉంటే.. ఇల్లు ఇల్లుగా ఉండదు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఏ వస్తువూ పెట్టిన చోట ఉండదు. ఒక్కటి వారికి ఏది నచ్చితే వాటితోనే ఆడుతూంటారు. అందులోనూ ఇక నడిచే పిల్లలు ఉంటే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లోని వంట సామానుతో ఆడుకుంటూ నానా రచ్చ చేస్తారు. పిల్లలు ఎక్కువగా కిచెన్ సామానుతోనే ఆడుకుంటూ ఉంటారు. ప్లేట్లు, గ్లాసులు, కూరగాయలు ఇలా ఏది వారి కంటికి బాగా కనిపిస్తుంటే వాటితోనే ఆడుతూ చిందరవందరగా..

Child Care: పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?
Child Care
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 08, 2023 | 9:45 PM

Share

ఇంట్లో చంటి పిల్లలు ఉంటే.. ఇల్లు ఇల్లుగా ఉండదు. ఇల్లు పీకి పందిరి వేస్తారు. ఏ వస్తువూ పెట్టిన చోట ఉండదు. ఒక్కటి వారికి ఏది నచ్చితే వాటితోనే ఆడుతూంటారు. అందులోనూ ఇక నడిచే పిల్లలు ఉంటే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లోని వంట సామానుతో ఆడుకుంటూ నానా రచ్చ చేస్తారు. పిల్లలు ఎక్కువగా కిచెన్ సామానుతోనే ఆడుకుంటూ ఉంటారు. ప్లేట్లు, గ్లాసులు, కూరగాయలు ఇలా ఏది వారి కంటికి బాగా కనిపిస్తుంటే వాటితోనే ఆడుతూ చిందరవందరగా చేస్తారు. అయితే కొంత మంది తల్లిదండ్రులు మాత్రం పిల్లల చేతిలో నుంచి వారి చేతిలో నుంచి బలవంతంగా లాగేసుకుంటారు. కానీ పిల్లలు కిచెన్ వస్తువులతో ఆడితేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లలు కిచెన్ వస్తువులతో ఆడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కమ్యునికేషన్ స్కిల్స్ పెరుగుతాయి:

పిల్లలు కిచెన్ కి సంబంధించిన సామాన్లు, వస్తువులు, కూరగాయలతో ఆడుతూ ఉంటే వారిలో.. కమ్యునికేషన్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. కిచెన్ లోని పాత్రల పేర్లు చెప్పడం వల్ల వారికి త్వరగా మాటలు రావడమే కాకుండా.. వాటి గురించి కూడా తెలుసుకుంటారు.

మోటార్ స్కిల్స్ పెరుగుతాయి:

చిన్నారులు కిచెన్ పాత్రలు, వస్తువులతో ఆడుకోవడం వల్ల వారిలో మోటార్ స్కిల్స్ పెరుగుతాయి. మోటార్ స్కిల్స్ అంటే.. పిల్లల చేతులు, మణికట్టులోని చిన్న కండరాలు కూడా కదులుతాయి. వీటి వల్ల పిల్లల కండరాలు దృఢంగా మారతాయి. కాబట్టి చిన్నారిలో మోటార్ నైపుణ్యాలు మెరుగు పరచడం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

చదువులో సహాయ పడతాయి:

చిన్న పిల్లలు కిచెన్ పాత్రలు, వస్తువులతో ఆడటం వల్ల.. భవిష్యత్తులో అవి వారి చదువులో సహాయ పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతే కాకుండా పిల్లలు ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్ స్కిల్స్ ను కూడా నేర్చుకునేందుకు సహాయ పడతాయి. కాబట్టి పిల్లల్ని కిచెన్ సామానుతో ఆడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

ఇంద్రియాలు అభివ‌ృద్ధి చెందుతాయి:

చిన్న పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకోవడం వల్ల.. వారిలో ఇంద్రియాలు కూడా అభివృద్ధి చెందుతాయి. వారి చేతులతో వివిధ రకాల పాత్రలు, వస్తువులు, లోహాలు తాకినప్పుడు వారిలో ఇందియ అభివృద్ధికి హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా వాటి గురించి చెప్పడం వల్ల కూడా పిల్లలు వాటిని చక్కగా గుర్తు పెట్టుకుంటారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?