Parenting Tips: మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!

పిల్లలు బలంగా, దృఢంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే పిల్లలు ఆరోగ్యంగా, బరువుతో ఉండాలని ఎన్నో రకాల ఫుడ్స్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారికి పాలు ఎక్కువగా ఇస్తారు. అయితే మరి కొంత మంది పిల్లలు పాలు తాగమని మారం చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు పాలల్లో ఎనర్జీ డ్రింక్ కలిపి ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వీటిల్లో వెనీల్లా, చాక్లెట్, స్ట్రాబెర్రీ ఇలా పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ తో పిల్లలు ఇష్టంగా పాలు..

Parenting Tips: మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
Parrenting Tips
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 08, 2023 | 9:50 PM

పిల్లలు బలంగా, దృఢంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే పిల్లలు ఆరోగ్యంగా, బరువుతో ఉండాలని ఎన్నో రకాల ఫుడ్స్ పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో వారికి పాలు ఎక్కువగా ఇస్తారు. అయితే మరి కొంత మంది పిల్లలు పాలు తాగమని మారం చేస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలకు పాలల్లో ఎనర్జీ డ్రింక్ కలిపి ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు. వీటిల్లో వెనీల్లా, చాక్లెట్, స్ట్రాబెర్రీ ఇలా పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ ఫ్లేవర్స్ తో పిల్లలు ఇష్టంగా పాలు తాగుతారని పేరెంట్స్ ఆ పౌడర్ ని మిక్స్ చేసి ఇస్తారు. కానీ వీటి వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటుందని చాలా మందికి తెలీదు. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కెమికల్స్, రసాయనాలు ఉంటాయి:

ఎనర్జీ డ్రింక్స్ లో యాడెడ్ కలర్స్, ఫ్లేవర్స్ కలుపుతూ ఉంటారు. అంతే కాకుండా అవి నిల్వ ఉండటానికి వివిధ రకాల కెమికల్స్, రసాయనాలు కలుపుతారు. ఇలాంటి పౌడర్స్ పిల్లలకు ఇవ్వడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. కొంత మంది పిల్లలకు వాంతులు, విరేచనాలు అవ్వడం, బలహీనంగా మారడం వంటివి జరుగుతాయి. కాబట్టి వీటిని పిల్లలకు పట్టించేముందు పలు జాగ్రత్తలు పాటించాలి.

పంచదార ఎక్కువగా ఉంటుంది:

పిల్లలకు ఇచ్చే ఎనర్జీ డ్రింక్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పౌడర్ తియ్యగా, రుచిగా ఉండేందుకు పంచదారను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. దీని వల్ల పిల్లలు బరువు పెరగడం, డయాబెటీస్ వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందులోని తీపి కారణంగా ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ కి బదులు నేచురల్ గా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నేచురల్ ఆహార పదార్థాలు బెస్ట్:

ఎనర్జీ డ్రింక్స్ లో పోషకాలు ఉన్నా.. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటికి బదులు నేచురల్ గా ఉండే వెజిటేబుల్స్, పండ్లు, నట్స్ ఇవ్వడం మంచిది.

వ్యసనంలా మారుతుంది:

ఎనర్జీ డ్రింక్ కలిపిన పాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల.. పిల్లలకు ఇదో వ్యసనంలా మారుతుంది. కాబట్టి పిల్లలకు దీన్ని దూరంగా ఉంచడమే మంచిది. అప్పుడప్పుడు మంచిదే కానీ.. రెగ్యులర్ గా మాత్రం అస్సలు ఇవ్వకూడదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్